Sakshi News home page

అంగన్‌వాడీ అస్తవ్యస్తం

Published Mon, Feb 12 2018 2:33 PM

anganwadi facing problems in nirmal - Sakshi

నిర్మల్‌అర్బన్‌ : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం విస్మరిస్తోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఆయా పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. నోటిఫికేషన్‌ వెలువడి మూడు నెలలైనా ఇ ప్పటివరకు భర్తీకి నోచుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న కేంద్రాల్లో చిన్నారుల ఆలనాపాలన కరువవుతోంది. ఓ వైపు సిబ్బంది కొరత, మరోవైపు సౌకర్యాల లేమి.. వెర సి రేపటి పౌరుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలోని కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అ ద్దె భవనాల్లో కొన్ని, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. దీంతో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణమే లేకుండా పోతోంది. సరైన గదులు లేక ఇరుకైన, చీకటి గదుల్లో నిర్వహిస్తున్నారు. 

జిల్లాలోని అంగన్‌వాడీ సమాచారం 
అంగన్‌వాడీ కేంద్రాలు : 816  
మినీ అంగన్‌వాడీలు : 110 
నోటిఫికేషన్‌లో పేర్కొన్న  ఖాళీలు: 242 
(టీచర్‌–55, ఆయా–151,  మినీ అంగన్‌వాడీ టీచర్‌–36


అద్దె భవనాలు.. అరకొర వసతులు..

 
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించింది. సొంత భవనాల నిర్మాణం, వసతుల కల్పనను విస్మరించింది. చాలా కేంద్రాలు అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య కొనసాగుతుండగా.. నిత్యం కేంద్రాలకు వచ్చే కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు గాలి, వెలుతురు లేని ఇరుకైన గదుల్లోనే చదువు కొనసాగించాల్సి వస్తోంది. చిన్నారుల ఆట, పాటలకు సరైన వసతులు లేవు. కొన్ని అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించే అద్దె కూడా సక్రమంగా రాకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారుతోంది. దీంతో అంగన్‌వాడీ టీచర్లు ఇంటి యజమానుల కు అద్దె చెల్లించేందుకు పాట్లు పడుతున్నారు. 


వివాదంతో నిలిచిన పోస్టుల భర్తీ.. 


జిల్లా వ్యాప్తంగా 926 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 816 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 110 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో ఆరేళ్లలోపు చిన్నారులు సుమారు 64,335 మంది ఉన్నారు. 7,170 మంది వరకు గర్భిణులు, 6,081 మంది వరకు బాలింతలున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతీరోజు గుడ్డు, పౌష్టికాహారాన్ని అందించాలి. పిల్లలకు బాలామృతం, గుడ్లు, పౌష్టికాహారం అందించాలి. వీటితో పాటు చిన్నారులకు కథలు చెప్పాలి. అక్షరాలు నేర్పించాలి. అయితే.. జిల్లాలో 242 అంగన్‌వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్తులు ఖాళీగా ఉండడంతో సేవల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటి భర్తీ కోసం అక్టోబర్‌ 2017లో ప్రభుత్వం నోటిí œకేషన్‌ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ పూ ర్తయి, తుది జాబితా వెలువడింది. అయితే ఇందులో స్థానికేతరులు, అనర్హులకు పోస్టులు కేటాయించారని కొందరు కలెక్టర్‌ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ విచారణ చేపట్టి మెరిట్‌ ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మే రకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. పోస్టు ల నియామకం కలెక్టర్‌ ఆదేశాల మేరకు తర్వలోనే చేపడతామని జిల్లా మహిళా శిశు సంక్షే మ శాఖ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు.  

 
 

Advertisement
Advertisement