Sakshi News home page

అంగన్‌వాడీల మహాధర్నా

Published Wed, Jul 11 2018 1:21 PM

Anganwadi Workers Protest In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: స్త్రీ, శిశు సంక్షేమానికి రక్షణ కల్పించాలని, అంగన్‌వాడీలకు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ ఆ ధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం చే పట్టిన ఈ ధర్నా 36 గంటలు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు మల్లేష్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఐసీడీఎస్‌ రక్షణ, అంగన్‌వాడీలను కార్మికులుగా గు ర్తించడం లేదని, కనీస వేతనం, పీఎఫ్, పెన్షన్, ఈ ఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాలు చర్చించలేదని అన్నారు.

పోషకాహారానికి అయ్యే ఖర్చును లెక్కగట్టి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇది సరైంది కాదని అన్నారు. సెప్టెంబర్‌ 5న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, అందరు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, చిన్నన్న, సుశీల్, వెంకటమ్మ, అనసూయ, పార్వతీ, మంజూల, కళావతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement