మూల్యం రూ.300 కోట్లు | Sakshi
Sakshi News home page

మూల్యం రూ.300 కోట్లు

Published Fri, Dec 8 2017 1:30 AM

Annual Fine for Traffic violations - Sakshi

చిక్కడపల్లిలో నివసించే రాజు కొత్త వాహనం కొన్నాడు. స్నేహితులు అడగడంతో మందు పార్టీ ఇచ్చాడు. పార్టీ ముగిశాక కొత్త టూ వీలర్‌పై ఇంటికి వెళ్తూ డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. 3 రోజుల తర్వాత కోర్టుకు వెళ్లి రూ.2,500 జరిమానా కట్టి బండి తెచ్చుకున్నాడు. మద్యం సేవించి వాహనం నడపరాదన్న విషయం తెలిసి మరీ అతను జేబుకు చిల్లు పెట్టుకున్నాడు. రాష్ట్రంలో నిత్యం ఇలాంటి వాహనదారులు మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణలకు పాల్పడుతూ తగిన ‘మూల్యం’ చెల్లిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిత్యం వేలాది మంది వాహనదారులు యథేచ్ఛగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. లైసెన్స్‌ లేకుం డా వాహనాలు నడపడం మొదలు మద్యం సేవించి బండ్లు నడపడం వరకు వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారి ని దారికి తెచ్చేందుకు అధికారులు రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ జరిమానాలను వడ్డిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా వసూలవుతున్న ఈ జరిమానాల విలువ రూ.300 కోట్లు దాటింది. ప్రధానంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌తోపాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ ఉల్లంఘనులు భారీగా జరిమానాలు కడుతున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరి ధిలో రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల (ఏటా సుమారు రూ.22 కోట్లు) జరిమానాలు చెల్లిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ పరిధి లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల చొప్పున (ఏటా సుమారు రూ.28 కోట్లు) జరిమానాలు కడుతున్నారు. మిగిలిన జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో రోజుకు రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానాలు చెల్లిస్తున్నారు. ఇలా 24 యూనిట్లలో ఏటా రూ.87.64 కోట్లు జరిమానాల రూపంలో వాహనదారులు మూల్యం చెల్లిస్తున్నారు.

ఇవి కాకుండా వారాంతంలో 3 రోజులపాటు జరిగే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల ద్వారా వాహనదారులు చెల్లిస్తున్న మూల్యం ఏటా రూ.10 కోట్లు దాటిపోతోంది. ఇవి కేవ లం ట్రాఫిక్‌ పోలీసులకు చెల్లిస్తున్న జరిమానా లే. దీనికితోడు శాంతిభద్రతల విభాగం పోలీసులు చేసే ప్రత్యేక డ్రైవ్‌లు, సాధారణ తనిఖీ ల్లో భాగంగా మొత్తం పోలీసుశాఖకు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్లు జరిమానాల రూపం లో వాహనదారులు చెల్లిస్తున్నారు. అదే విధం గా రవాణశాఖ అధికారులు నిత్యం వాహనాల తనిఖీ, నిబంధనల ఉల్లంఘనులకు వేసే జరి మానాలు ఏకంగా రూ.150 కోట్లు దాటింది.

జరిమానాలు మరింత పెరిగే అవకాశం..  
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆన్‌లైన్‌ చలాన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినా జిల్లాలు, నూతనంగా ఏర్పడ్డ కమిషనరేట్లలో ఇంకా మాన్యువల్‌గానే చలాన్లు రాస్తున్నారు. అయితే త్వరలో ప్రతీ జిల్లా కేంద్రంతోపాటు ఆ జిల్లా పరిధిలోని ప్రధాన పట్టణాల్లో సీసీటీవీల ద్వారా ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ చలాన్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అలాగే డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు సైతం జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసులు మా త్రమే చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరికరాలు అందుబాటులోకి వస్తే ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. దీంతో మందుబాబులు చెల్లించే జరిమానాలు సైతం మరింత పెరిగే అవకాశం ఉంది.

వాహనాల వివరాలు
♦  రాష్ట్రవ్యాప్తంగా నిత్యం రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య 82 లక్షలు
వాటిలో అన్ని రకాల అనుమతులు ఉన్న వాహనాలు 55 శాతం నుంచి 60 శాతం
రాష్ట్రవ్యాప్తంగా నెలకు సగటున జరిమానాల బారినపడుతున్న వాహనాల సంఖ్య 18–20 లక్షలు
రోజూ రోడ్డెక్కుతున్న కొత్త వాహనాల సంఖ్య 6–7 వేలు  

స్వీయ నియంత్రణ లేకపోవడమే...
లక్షల రూపాయల విలువైన వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులు వాటి రిజిస్ట్రేషన్లు, బీమా, ఇతరత్రా వ్యవహారాల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని కారణంగా అటు ట్రాఫిక్‌ పోలీసులకు, ఇటు రవాణాశాఖ అధికారులకు జరిమానాలు చెల్లించుకుంటున్నారు. అదే విధంగా రోడ్లపై వాహనాలు నడిపే సందర్భాల్లో స్వీయ నియంత్రణ పాటించకుండా విపరీతమైన వేగం, నిర్లక్ష్యం కారణంగా చలాన్ల రూపంలో కోట్ల రూపాయల జరిమానాలు కడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement