బంగారు గనులేమైనా వచ్చాయా: షబ్బీర్‌ అలీ | Sakshi
Sakshi News home page

బంగారు గనులేమైనా వచ్చాయా: షబ్బీర్‌ అలీ

Published Mon, Mar 27 2017 6:04 PM

బంగారు గనులేమైనా వచ్చాయా: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని శాసనమండలిలో కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. లక్షల కోట్ల బడ్జెట్ ఎలా పెడుతున్నారు. బంగారు గనులు ఏమైనా వచ్చాయా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి వడ్డీ కూడా ప్రభుత్వమే కడతాని చెప్పిందని గుర్తుచేశారు. రణమాఫీ గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. విద్యుత్‌ సంస్థలు అప్పుల్లో కురుకుపోయాయని, రెండేళ్లకే రూ.12 వేల కోట్ల అప్పులు సంస్థలపై ఉన్నాయన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. 
 
రైతులకు ఉచిత విద్యుత్ అని చెప్పి మళ్లీ మీటర్లు ఫిట్ చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. మీటర్లను ఏ ఉద్దేశంతో పెడుతున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు.  డబుల్ ఇళ్ల  నిధుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, మంత్రి సరైన సమాధానం చెప్పాలన్నారు. విద్యారంగం విషయంలో కేజీ టూ పీజీ గురించి చెప్పలేదని, కొత్త యూనివర్సిటీల ఊసే లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి బిల్లు పెట్టినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement