ఆపదలో ఆదుకుంటున్న ‘ఆరాధన’ | Sakshi
Sakshi News home page

ఆపదలో ఆదుకుంటున్న ‘ఆరాధన’

Published Tue, Apr 14 2020 11:53 AM

Aradana Television Group Distributed Food For Poor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రార్థన మందిరాలన్ని( గుడి, చర్చి, మసీద్‌) మూసివేశారు. అందుకే ప్రతి ఒక్కరు తమ తోటి వారిలోనే భగవంతుడిని చూసుకుంటూ మానవసేవే మాధవ సేవ అంటూ తమ తోచిన సాయాన్ని చేస్తూ పక్కవారికి చేయూతనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  రన్ ఫర్ జీసస్ అవుట్ రీచ్ సందర్భంగా  ఆరాధన టెలివిజన్ సౌజన్యంతో హైదరాబాద్‌ అన్నోజిగూడ , పెరాజీము క్రిస్టియన్ ప్రేయర్ హాల్ ఆధ్వర్యములో నిరుపేద కుటుంబాలకు ఆహారం పాకెట్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పోచారం మునిసిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, కౌన్సిలర్స్ సాయిరెడ్డి, మెట్టు బాలిరెడ్డి, హేమ ఐలయ్య, సంఘపెద్దలు బి .ఆర్.డేవిడ్ సన్, జి.విక్టర్ ఇమ్మానుయేల్, ఇవాంజలిస్ట్ యం.జీవరాజు స్థానిక పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రొగ్రాం లో రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలని, యామ్నాంపేట, అన్నోజిగూడ తదితర ప్రాంతాల్లోని దాదాపు వెయ్యి మంది పేదకుటుంబాలు, వలస కూలీలు, పోలీస్ సిబ్బంది, పారిశుద్య కార్మికులకు వెజిటబుల్ బిర్యాణి పోట్లాలు, అరటిపళ్లు అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరు సామాజిక దూరం పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Advertisement
Advertisement