రేషన్‌ బియ్యం స్వచ్ఛందంగా వెనక్కు | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం స్వచ్ఛందంగా వెనక్కు

Published Tue, Dec 27 2016 2:17 AM

రేషన్‌ బియ్యం స్వచ్ఛందంగా వెనక్కు

కలెక్టర్‌కు అంగీకార పత్రాలను ఇచ్చిన 70 రైతు కుటుంబాలు

సాక్షి, పెద్దపల్లి: ‘‘ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాయి.. మేము పండించిన బియ్యా న్ని మేమే తింటాం. ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇస్తున్న బియ్యం సబ్సిడీ పక్కదారి పట్టకుండా మేమే ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం’’ అంటూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలం ఊశన్నపల్లె గ్రామానికి చెందిన 70 మంది ముందుకు వచ్చారు. ఈ రైతు కుటుంబాలు రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛందంగా జిల్లా కలెక్టర్‌ వద్దకు వచ్చా రు. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో జిల్లా కలెక్టర్‌ అలగు వర్షిణికి ఈ మేరకు అంగీకార పత్రాలను అందజేశారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి స్వగ్రామం ఇది. పూర్తిగా రైతు గ్రామం కాగా, 571రేషన్‌ కార్డులున్నాయి.

ప్రతి నెలా 107 క్వింటాళ్ల బియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా కిలోకు రూపాయి చొప్పు న పంపిణీ చేస్తున్నారు. ఈ యేడు వర్షాలు బాగా కురిశాయి, పంటలు సమృద్ధిగా పండాయి. రైతు కుటుంబాలన్నీ తాము పండించిన ధాన్యాన్నే బియ్యంగా తింటున్నా యి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్క దారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై పడుతు న్న భారాన్ని శంకర్‌రెడ్డి రైతులకు వివరించారు. దీంతో 70 రైతు కుటుంబాలకు చెందిన 285 యూనిట్‌దారులు సబ్సిడీ బియ్యం అవసరం లేదని ముందుకు వచ్చారు. దీంతో గ్రామంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈద శంకర్‌రెడ్డి సమక్షంలో కలెక్టర్‌ వర్షిణికి బియ్యం వద్దని అంగీకార పత్రాలను అందజే శారు. రాష్ట్రంలోనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతు కుటుంబాలను చైర్మన్, కలెక్టర్‌ అభినందించారు. రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం తీసుకోని కుటుంబాలన్నీ ఇలానే ముందుకు రావాలని, ప్రభుత్వంపై సబ్సిడీ భారాన్ని తగ్గించి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు నందించాలని పిలుపునిచ్చారు. గంగారం గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మంగళ వారం కొనసాగనుంది.

Advertisement
Advertisement