నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు | Sakshi
Sakshi News home page

నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Published Thu, Mar 10 2016 1:57 AM

నేటినుంచి  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

6110.27
 
 జిల్లా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు  నిధుల కేటాయింపుపై ఆశలు

2016-17 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి జరుగుతున్న తరుణంలో బడ్జెట్‌లో జిల్లాకు ఏ మేరకు నిధులు దక్కుతాయనే విషయంపై చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికి నల్లానీరందించే మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వంటి మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకనుగుణంగా జిల్లా అధికారులు ఆయూ శాఖల వారీగా మొత్తం రూ.6110.27 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇప్పటికే అందచేశారు - కరీంనగర్ సిటీ
 

మిషన్ భగీరథ ప్రాధాన్యం
టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలో ప్రధానమైంది ఇంటింటికి తాగునీరందించడం. ఇందుకోసం ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీళ్లు అందించకపోతే ఓట్లు అడగబోమని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు పదేపదే ప్రకటించడంతో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకంగా మారింది. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సైతం ప్రతిపాదనలు తయారు చేసింది. మిషన్ కాకతీయ పథకం ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉండడంతో జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం రూ.2540 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు.

రోడ్లు, రహదారుల పెద్దపీట
మిషన్ భగీరథ తర్వాత జిల్లాలో రోడ్లు, రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రహదారులు, భవనాల శాఖ రూ.800 కోట్లతో, పంచాయతీరాజ్ శాఖ రూ.404.51 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారుు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ లేన్‌ను డబుల్ లేన్‌గా, డబుల్‌ను ఫోర్‌లేన్ మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌లేన్, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ఫోర్‌లేన్ రహదారులు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు, నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు ఆర్‌అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు కలిపి రూ.1204 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారుు.

 సాగునీటి ప్రాజెక్టులపై ఆశలు

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.571 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఆర్థిక శాఖకు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ హయూంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగుతున్నారుు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కాగా వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు నీళ్లందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే మధ్యమానేరు ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నుంచి సాగునీరిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు నిధుల కొరత వల్ల ఆగుతూ... సాగుతున్నారుు. ప్రభుత్వ ఆశయూనికి అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయూలంటే బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటారుుంచాల్సిన అవసరముంది. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసిన ప్రభుత్వం గండిపెల్లి, గౌరవెల్లి జలాశయూల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణరుుంచింది. ఇందుకనుగుణంగా బడ్జెట్‌లో నిధుల కేటారుుంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

మిషన్ కాకతీయకు...
మిషన్ కాకతీయ ఫేజ్-1 కింద జిల్లాలో 1,188 చెరువుల పునరుద్ధరణ చేపట్టగా, 1,088 చెరువుల సర్వే పూర్తయింది. 822 చెరువులకు పరిపాలన అనుమతి వచ్చింది. 802 చెరువులకు టెండర్లు రాగా, 800 చెరువుల పనులకు అగ్రిమెంట్ పూర్తయ్యాయి. ఇప్పటికి 204 చెరువుల పనులు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ ఫేజ్-2లో 1,271 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. 1,161 చెరువుల సర్వే పూర్తి కాగా, 1,115 చెరువులకు అంచనాలు రూపొందించారు. 423 చెరువులకు పరిపాలనా అనుమతులు వచ్చాయి.ఇందుకోసం రూ.490 కోట్లు కేటారుుంచాలని కోరుతూ అధికారులు ప్రతిపాదనలు అందజేశారు.
 
 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం

 
టీఆర్‌ఎస్ మరో ప్రధానమైన హామీ నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం. తొలివిడతగా జిల్లాకు 5200 ఇండ్లు మంజూరు కాగా, ఇందులో ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున కేటారుుంచారు. జిల్లాలో డబుల్ ఇళ్ల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు రూ.430 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం రూ.191.62 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ రూ.125.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, మిగిలిన శాఖలు రూ.వంద కోట్లలోపే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారుు.

Advertisement
Advertisement