ప్రతిభావంతులకు పురస్కారాలు | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు పురస్కారాలు

Published Sat, May 9 2015 5:12 AM

awards to eminet Personalities on telangana formation day

- రాష్ట్రావతరణ ఉత్సవాల్లో భాగంగా 50 మందికి సత్కారం

హైదరాబాద్:
వచ్చే నెల తొలివారంలో నిర్వహించే రాష్ట్రావతరణ ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వ్యవసాయం, విద్య, ప్రభుత్వ ఉద్యోగం, సామాజిక సేవ, వైద్యం, క్రీడలు వంటి ముఖ్య రంగాలకు చెందిన 50 మందిని ఎంపిక చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అధ్యక్షుడుగా ఉండే ఈ కమిటీలో సాంస్కృతిక సలహాదారు,

తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ రంగాల్లో ప్రముఖులైన చుక్కా రామయ్య, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, పద్మజారెడ్డి, బి.నరసింగరావు, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సభ్యులుగా ఉంటారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఉత్తమ రైతు, ఉత్తమ ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు, ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి, ఉత్తమ సామాజిక సేవకుడు, ఉత్తమ వైద్యుడు, ఉత్తమ ఎన్‌జీవో, ఉత్తమ క్రీడాకారుడు/క్రీడాకారిణి, ఉత్తమ సాహితీవేత్త(తెలుగు-ఉర్దూ), ఉత్తమ వేద పండితుడు, ఉత్తమ అర్చకుడు, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ మండలం, ఉత్తమ మునిసిపాలిటీ, ఉత్తమ గ్రామపంచాయతీ, ఉత్తమ న్యాయకోవిదుడు, ఉత్తమ సైంటిస్ట్, ఉత్తమ వ్యాపారవేత్త/పారిశ్రామికవేత్తతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఈ సందర్భంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిని లక్షా నూట పదహారు రూపాయల నగదు పురస్కారం, శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement