బంగారం స్మగ్లింగ్‌లో అయూబ్ హస్తం | Sakshi
Sakshi News home page

బంగారం స్మగ్లింగ్‌లో అయూబ్ హస్తం

Published Thu, May 28 2015 1:00 AM

బంగారం స్మగ్లింగ్‌లో అయూబ్ హస్తం - Sakshi

అనుమానిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు తరచు బంగారంతో పట్టుబడటం వెనుక గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ హస్తం ఉండొచ్చని దక్షిణ మండలం పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది ఆగస్టులో అయూబ్‌దుబాయ్ పారిపోవడం.. ఐదారు నెలల నుంచి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద బంగారం దొరుకుతుండటంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇప్పటికే అయూబ్‌ను పట్టుకునేందుకు పోలీసులు లుకవుట్ నోటీసు జారీ చేశారు. దీంతో  ఇంటర్ పోల్ సాయంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 
అయూబ్ నేర చరిత్ర ఇదీ..

ఖైసర్ గ్యాంగ్‌కు పోటీగా గ్యాంగ్‌ను నడుపుతూ పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అయూబ్‌పై  ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. మొదట శాలిబండలో నివాసం ఉన్న అయూబ్ అనంతరం కాలాపత్తర్‌కు మకాం మార్చాడు. అయూబ్ అనుచరులైన ఒబేద్, అసద్, వాజిద్‌లపై పోలీసులు ఇప్పటికే పీడీ యాక్ట్‌లు కూడా ప్రయోగించారు. 

Advertisement
Advertisement