ఎల్‌ఈడీ వెలుగులు | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ వెలుగులు

Published Thu, Aug 21 2014 1:59 AM

baldia elected to pilot project

మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలో ఎల్‌ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటివరకు ఎస్‌వీ(సోడియం వెపర్) వీధి దీపాలు వాడుతుండగా వీటి ద్వారా వచ్చే విద్యుత్ బిల్లులు తడిసిమోపెడు అవుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని గట్టెకేల్కా ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు శ్రీకారం చు ట్టింది.

 ఈ క్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ పెలై ట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. త్వరలోనే పట్టణంలో ఎల్‌ఈడీ విద్యుత్ వెలుగులతో పట్టణానికి శోభ చేకూరనుంది. భారీగా విద్యుత్ బిల్లులకు కారణం అవుతున్న ఎస్‌వీ ల్యాంపులు, ఫ్లడ్‌లైట్లకు మంగళం పలికి వాటి స్థానంలో విద్యుత్‌బిల్లులను ఆదా చేసేలా ఎల్‌ఈ డీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేయాలని పురపాలక అధికారులకు ఆదేశాలు అందాయి.

 మొదటి దశలో 150ఎల్‌ఈడీ వీధి దీపాలు
 పైలట్ ప్రాజెక్టు క్రింద మంచిర్యాల పురపాలక సంఘం ను గుర్తించగా అధికారులు కూడా వెంటనే ఇందుకు ప్ర తిపాదనలు చేస్తున్నారు. మొదటి దశలో మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి ఏసీసీ చౌరస్తా వరకు ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 156 ఎస్‌వీ ల్యాంపులను వినియోగిస్తుండగా వీటి స్థానంలో ఎల్‌ఈడీలను ఏర్పాటు చేయనుండగా 150ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు.

 లక్షకుపైగా జనాభా ఉన్న పట్టణాల్లో 200ల వరకు ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పా టు చేసేలా వెసులుబాటు ఉండగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 250 వాట్స్ వరకు సామర్థ్యమున్న ఎల్‌ఈడీ వీధిదీపాలను అమర్చేలా ప్రతిపాదనలు చేవారు. హైమాస్ట్ లైట్లను ఈ ప్రాజెక్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ పెలైట్ ప్రాజెక్టు కింద ఏరియాకు ప్రత్యేక విద్యుత్ మీటర్‌ను బిగించి విద్యుత్ వినియోగంలో వచ్చిన మార్పులపై పరిశీలన చేస్తారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే పట్టణం మొత్తం విస్తరించేలా కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement
Advertisement