12న బీసీ గురుకులాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

12న బీసీ గురుకులాలు ప్రారంభం

Published Wed, Jun 7 2017 2:10 AM

12న బీసీ గురుకులాలు ప్రారంభం

మంత్రి జోగు రామన్న వెల్లడిl
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12న 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాలను లాంఛ నంగా ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభి స్తారని చెప్పారు. అన్ని హంగులతో అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. కేసీఆర్‌ ప్రకటించిన మేరకు తొలిసారిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కటి చొప్పున గురుకులాలను మంజూరు చేశారన్నా రు.

మంగళవారం సచివాలయం నుంచి 31 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా గురుకులాల ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. బీసీ గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణానికి పది ఎకరాల చొప్పున భూమిని సేకరించినట్లు, వీటి నిర్మాణాలు పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017–18లో 5, 6 తరగతులతో ప్రారంభించనున్న ఈ గురుకులాలతో 41,863 మంది విద్యార్థులు లబ్ధిపొందుతారని వివరించారు.  నాలుగేళ్లలో ఇంటర్‌ స్థాయికి ఈ గురుకులాలను అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌ కుమార్, కమిషనర్‌ జీడీ అరుణ, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, జేడీ కె.అలోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement