ర్యాగింగ్‌ను సహించం

15 Dec, 2014 01:56 IST|Sakshi
ర్యాగింగ్‌ను సహించం

బెల్లంపల్లి : వారందరూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం బస్సులు, ఆటోల్లో బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలా వచ్చి వెళ్లే క్రమంలో బాలికలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇక కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థిని, విద్యార్థులు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ వంటి ఆకృత్యాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలా విద్యార్థిని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసుశాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసే ప్రయత్నం చేసింది సాక్షి. శాంతిభద్రత పరిరక్షణలో ఎంతో బిజీగా ఉండే బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్‌ భూషణ్ వీఐపీ రిపోర్టర్‌గా మారి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో అడిషనల్ ఎస్పీ సంభాషణ ఇలా సాగింది..

అడిషనల్ ఎస్పీ : హాయ్ గల్స్, హౌఆర్‌యూ..
విద్యార్థినులు : (బెంచీపై నుంచి లేచి నిలబడి) హాయ్ సార్..
అడిషనల్ ఎస్పీ : నేను భాస్కర్‌భూషణ్, అడిషనల్ ఎస్పీ
విద్యార్థినులు : ఓకే సార్.. గుర్తు పట్టాం
అడిషనల్ ఎస్పీ : ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. చెప్పండి(అంటూనే ఓ విద్యార్థినిని పలకరించారు.)  
అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటమ్మా...?
విద్యార్థిని : సార్.. నా పేరు అనుష
అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు..?
అనూష : ఏఈఐ ఫైనల్ ఇయర్
అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ కాలేజీలో ఈవ్‌టీజింగ్ ఏమైనా జరుగుతోందా?
అనూష : అలాంటిదేమీ లేదు సార్..
అడిషనల్ ఎస్పీ : భయపడకు, అలా జరిగితే నిర్భయంగా చెప్పు.(పక్కనే ఉన్న మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు)
విద్యార్థిని : లేదు సార్.. మేము బాగానే ఉంటున్నాం.
అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ?వనజ : సార్ నా పేరు వనజ
అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు. మీదెక్కడా?
వనజ : నేను కూడా ఏఈఐ ఫైనల్ ఇయర్, మాది జైపూర్ సార్
అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
వనజ : ఫార్మర్స్(రైతులు) సార్
అడిషనల్ ఎస్పీ : ఓకే మిమ్మల్నీ ఎవరైనా ఈవ్‌టీజ్ చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు..
వనజ : అది.. సార్..
అడిషనల్ ఎస్పీ : ఏం పరవాలేదు ధైర్యంగా చెప్పమ్మా..
వనజ : సార్.. అమ్మాయిలను టీజ్ చేసే వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
వనజ : ఇకముందు మరే అమ్మాయిని టీజ్ చేయకుండా ఫనిష్‌మెంట్ ఇవ్వాలి. బట్ అతడి స్టడీ మాత్రం స్పాయిల్ కాకుండా చూడాలి సార్.
అడిషనల్ ఎస్పీ : గుడ్... బాగా చెప్పావమ్మా.(మరో అమ్మాయితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ)
అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటమ్మా?
విద్యార్థిని : సార్, నా పేరు సుప్రియ
అడిషనల్ ఎస్పీ : ఎక్కడ నుంచి వస్తావు
సుప్రియ : సార్, మాది రామకృష్ణాపూర్
అడిషనల్ ఎస్పీ : కాలేజీకి ఎలా వస్తావు..
సుప్రియ : బస్సులో వస్తాను సార్
అడిషనల్ ఎస్పీ : బస్సు ప్రయాణంలో ఏమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా..
సుప్రియ : పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు సార్.
అడిషనల్ ఎస్పీ : బస్సులో గల్స్ కూర్చునేందుకు సీటు ఇస్తారా?
సుప్రియ : ఒక్కోసారి కష్టంగానే ప్రయాణం చేస్తుంటాం సార్.. (మరో అమ్మాయితో మాట్లాడుతూ)
అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ
విద్యార్థిని : నా పేరు హారతి సార్
అడిషనల్ ఎస్పీ : నువ్వెక్కడి నుంచి కాలేజీకి వస్తావు
హారతి : మందమర్రి నుంచి సార్
అడిషనల్ ఎస్పీ : నీవు కూడా బస్సులోనే వస్తావా
హారతి : అవును సార్..
అడిషనల్ ఎస్పీ : ఓకే.. బస్సు ప్రయాణంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?(మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు.)
విద్యార్థిని : సార్ హైదరాబాద్‌లో మాదిరిగా ఇక్కడ కూడా బస్సుల్లో ఉమెన్స్‌కు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలి.
అడిషనల్ ఎస్పీ : ఓకే... మీ పేరు?
విద్యార్థిని : సార్ నా పేరు సుష్మిత
అడిషనల్ ఎస్పీ : ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి మీరెప్పుడైనా తీసుకెళ్లారా?
సుష్మిత, సుప్రియ, హారతి : లేదు సార్..
అడిషనల్ ఎస్పీ : కనీసం మీ కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్స్‌కు చెప్పారా?
సుష్మిత, సుప్రియ, హారతి : చెప్పలేదు సార్..
అడిషనల్ ఎస్పీ : మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ ఆర్టీసీ అధికారులకు చెప్పండి. పరిశీలించి సాల్వ్ చేస్తారు. ఓకేనా..
సుష్మిత, సుప్రియ, హారతి : అలాగే సార్
అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్ రక్షణకు ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి తెలుసా?
హారతి : కొన్ని తెలుసు సార్..
అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్‌ను వేధిస్తే నిర్భయ చట్టం, రక్షణకు షీ, అత్యవసరంగా 181 వంటి సదుపాయాలను పోలీసు శాఖ కల్పిస్తోంది.
సుప్రియ : అవును సార్. వీటి గూర్చి ఇంకా చాలామందికి తెలియదు..
అడిషనల్ ఎస్పీ : ఇలాంటి విషయాలను గల్స్ తోటి వారికి చెప్పాలి. వారికి అవగాహన కల్పించాలి.
హారతి : అలాగే చెబుతాం సార్
అడిషనల్ ఎస్పీ : గల్స్‌ను వేధించినట్లు తెలిస్తే సహించేది లేదు. చట్టపరంగా దోషులపై చర్య లు తీసుకుంటాం. బాయ్స్ బుద్ధిగా మెలగాలి.(అంటూ అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ వరండాలో ఉన్న విద్యార్థుల వైపు వెళ్లారు.)
అడిషనల్ ఎస్పీ : (ఓ విద్యార్థి వద్దకు వెళ్లి) నీ పేరేంటీ?
విద్యార్థి : నా పేరు నితిన్
అడిషనల్ ఎస్పీ : ఫ్రెషర్స్‌ను ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా?
నితిన్ : మా కాలేజీలో ర్యాగింగ్ జరగదు సార్..
అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఇంత వరకు ఎవరిని ర్యాగింగ్ చేయలేదా?
నితిన్ : లేదు సార్..
అడిషనల్ ఎస్పీ : ఇంతకుముందు ర్యాగింగ్ జరిగినట్లు విన్నాను. నిజం కాదా?
నితిన్ : సార్.. నాకైతే తెలియదు.
అడిషనల్ ఎస్పీ : ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నిషేధం కనుక అటువంటి చర్యలు కాలేజీలో జరిగితే సహించేది లేదు. ఆ దుశ్చర్యలకు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా కాలేజీ నుంచి తొలగించబడతారు.
విద్యార్థులు (సామూహికంగా మాట్లాడుతూ) : అలాంటి చర్యలకు పాల్పడం సార్
అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా?
నితిన్ : ఉంది సార్
అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటీ?
నితిన్ : గౌట్‌జాబ్ సాధించాలనేది నా ఏయిమ్ సార్
అడిషనల్ ఎస్పీ : ఓకే... బెస్టాఫ్‌లక్.(మరో విద్యార్థిని పలకరించారు.) మీ పేరేంటీ?
విద్యార్థి : శ్రీకాంత్ సార్
అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో ప్లేస్‌మెంట్ ఉందా?
శ్రీకాంత్ :  లేదు సార్..
అడిషనల్ ఎస్పీ : ఎందుకు జరగడం లేదు...?
శ్రీకాంత్ :  ఏమో సార్.. నాకు తెలియదు.
అడిషనల్ ఎస్పీ : మైనింగ్ బ్రాంచి ఉంది కదా? సింగరేణిలో హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ ఉద్యోగాలు వస్తాయి కదా?
శ్రీకాంత్ :  అవును సార్... మైనింగ్‌కు మంచి డిమాండ్ ఉంది. (ఆతర్వాత అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న అమ్మాయిల వద్దకు వెళ్లి పలకరించారు.)
అడిషనల్ ఎస్పీ : మీరు బాగా చదువుకుంటున్నారా?
విద్యార్థినులు : బాగా చదువుకుంటున్నాం సార్.
అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీతో బాయ్స్ ఎలా వ్యవహరిస్తున్నారు?
సల్మాతబస్సుమ్ : (అనే విద్యార్థిని మాట్లాడుతూ) ఫ్రెండ్లీగా ఉంటారు సార్..
అడిషనల్ ఎస్పీ : ఏం ప్రాబ్లమ్స్ చేయట్లేదు కదా?
సల్మాతబస్సుమ్ : అలాంటిదేమి లేదు సార్..
అడిషనల్ ఎస్పీ : అన్ని సబ్జెక్టుల లెక్చరర్స్ ఉన్నారా?
సల్మాతబస్సుమ్ : అందరు ఉన్నారు సార్.
అడిషనల్ ఎస్పీ : క్లాస్ బాగా చెబుతారా?
సల్మాతబస్సుమ్ : బాగా చెబుతారు సార్.(మరో విద్యార్థినితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ)
అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటీ?
విద్యార్థిని : నా పేరు స్వప్న సార్..
అడిషనల్ ఎస్పీ : రోజు కాలేజీకి ఎలా వస్తావు?
స్వప్న : ఆటోలో వస్తాను సార్..
అడిషనల్ ఎస్పీ : ఆటో డ్రైవర్లు ఏమైన ప్రాబ్లమ్స్  చేస్తున్నారా?
స్వప్న : లేదు సార్.
అడిషనల్ ఎస్పీ : ఓకే.. గల్స్ ధైర్యంగా కాలేజీకి రావాలి. ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే మా దృష్టికి తీసుకురండి.. తగిన చర్యలు తీసుకుంటాం.
విద్యార్థినులు : ఓకే.... థ్యాంక్యూ సార్... (వెంటనే అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న లెక్చరర్స్ వద్దకు వచ్చి  మాట్లాడారు.)
అడిషనల్ ఎస్పీ : గల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మీపైన(లెక్చరర్స్) ఉంది. రాకపోకలు చేసే క్రమంలో కలుగుతున్న ఇబ్బం దులు, కాలేజీలో  గల్స్ పడే ప్రాబ్లమ్స్‌ను అడి గి తెలుసుకొని పరిష్కరించండి. మా దృష్టికి తీసుకువస్తే మేము కూడా సహకరిస్తాం.
లెక్చరర్స్ : తప్పకుండా సార్. మీరు సూచించిన మాదిరిగానే గల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా