భళీ బీరన్న.. | Sakshi
Sakshi News home page

భళీ బీరన్న..

Published Sat, Jul 16 2016 2:09 AM

భళీ బీరన్న..

ఉర్సు, కరీమాబాద్‌లలో వైభవంగా బీరన్న బోనాలు
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
ఒళ్లు గగుర్పొడిచేలా ‘ గావుపట్టే’ దృశ్యం

 
కరీమాబాద్ :  ‘భళీ బీరన్నా.. భళీ’ అంటూ కురుమల కేరింతలు.. నృత్యాలు.. డప్పుల చప్పుళ్లు ఓ వైపు.. బోనాలతో బారులు తీరిన వనితలు మరో వైపు. వెరసి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్ ఏరియూల్లో సందడి కనిపించింది. పోతరాజుల కత్తుల విన్యాసాలు ఉత్సాహాన్ని నింపారుు. గొర్రెపిల్లను గావుపట్టే కీలక సమయంలో కురుమలు కదన రంగంలోకి దూకినట్లు కదిలిరావడం ఉత్తేజాన్ని అందించింది. మహిళలు గావుపట్టిన గొర్రెపిల్ల మీది నుంచి వెళ్లి బీరన్నగుడిలో బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాలను కరీమాబాద్ బీరన్నస్వామి ఆలయ కమిటీ, ఉర్సు బీరన్న దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉర్సు బీరన్న ఆలయ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఉర్సు నుంచి వచ్చిన కురుమలు చెట్లవారిగడ్డ మీదుగా బీరన్నగుడి వద్దకు చేరుకోగా, కరీమాబాద్ బీరన్న గుడి అధ్యక్షుడు కోరె కృష్ణ ఆధ్వర్యంలో కరీమాబాద్ కురుమలు రామస్వామి గుడి నుంచి బురుజు మీదుగా బీరన్న ఆలయూనికి వెళ్లారు.
 
దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు..
బీరన్న బోనాల  పండుగ సందర్భంగా ఉర్సు, కరీమాబాద్ బీరన్న దేవాలయాలను ఎమ్మెల్యే కొండా సురేఖ దర్శించుకున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో పాటు కార్పొరేటర్లు మరుపల్ల భాగ్యలక్ష్మి, మేడిది రజిత, కత్తెరశాల వేణు, కేడల పద్మ తదితరులు బీరన్నగుడిని దర్శించుకొని పూజలు చేశారు.  కార్యక్రమంలో ఉర్సు, కరీమాబాద్ బీరన్న ఆలయ కమిటీల బాధ్యులు మరుపల్ల రవి, కోరె కృష్ణ, ఈర రాధాకృష్ణ, మురికి కుమారస్వామి, వాసూరి శ్రీనివాస్,  కడారి కృష్ణ, గోవింద్ కొంరయ్య, మండల ప్రమీల, దాయ్యల సుధాకర్, నరిగె బక్కయ్య, కాళేశ్వర్, ఈశ్వరప్రసాద్, కోరె నాగరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఇంతెజార్‌గంజ్ సీఐ భీంశర్మ బందోబస్తు నిర్వహించారు. ఎస్సైలు రవీందర్, పీఎస్సై నర్సింహారావు, పీసీలు రమేష్, శ్రీనివాస్, కిరణ్, సిబ్బంది విధులు నిర్వర్తించారు.  
 
 
 
 

Advertisement
Advertisement