ప్రజా సమస్యలపై బీజేపీ క్షేత్రస్థాయి ఆందోళనలు | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై బీజేపీ క్షేత్రస్థాయి ఆందోళనలు

Published Sat, Oct 8 2016 4:04 AM

ప్రజా సమస్యలపై బీజేపీ  క్షేత్రస్థాయి ఆందోళనలు

• జిల్లా నాయకులకు సూచన
• కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామ, జిల్లా స్థాయిలో ప్రచారం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ, మండల స్థాయిలో ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం పార్టీపరంగా చేపట్టే కార్యకమాలను, ఆందోళనలను క్షేత్ర స్థాయి నుంచి మొదలుపెట్టాలని జిల్లా నాయకులకు సూచించింది. పార్టీ నాయకులంతా జిల్లాలు, మండల స్థాయిల్లో పర్యటించాలని.. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. గురు, శుక్రవారాల్లో మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో పార్టీ పటిష్టానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించారు.

 అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయం, కేటాయింపుల గురించి ముందుగా కార్యకర్తలకు అర్థమయ్యేలా వివరించాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలపై గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రచారం చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా నేతలకు పార్టీ సూచించింది. అలాగే ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవసాయ రంగం, రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై కార్యక్రమాలను రూపొందించుకోవాలని ఆదేశించింది.

Advertisement
Advertisement