రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి

Published Sat, Feb 11 2017 2:35 AM

రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి - Sakshi

 తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో అనుకూల వాతావరణముందని నివేదిక
 ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక రాష్ట్రానికి అమిత్‌షా!


సాక్షి, హైదరాబాద్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ అధినాయకత్వం పూర్తిగా దృష్టి సారించ నుంది. తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తమ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని జాతీయ నాయకత్వం పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో అత్యంత అనుకూల పరిస్థితు లున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇటీ వల బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి సతీశ్‌జీ మూడ్రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు కూడా అంతర్గత సమావేశంలో ఈ విషయాన్నే వెల్లడించినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అంచ నా వేయనున్నారని తెలిసింది. దీంతో ఏ అంశాన్నీ ఆషామాషీగా తీసుకోకుండా జాతీ య నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో పార్టీ నాయక త్వానికి స్పష్టం చేసింది. కేంద్రం చేపడుతున్న పథకాలు, వాటి ద్వారా వివిధ వర్గాల ప్రజల కు అందుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని దిశానిర్దేశం చేసింది.

పరిస్థితులను బేరీజు వేసుకుని...
రాష్ట్రంలో పార్టీకున్న అనుకూల పరిస్థితు లను బేరీజు వేసుకుని ముందుకు సాగాలని అధినా యకత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టడంతో పాటు టీఆర్‌ఎస్‌ విషయంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శిం చేందుకు నాయకత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఎస్సీల వర్గీకరణపై ప్రధానితో రాష్ట్ర ప్రభుత్వ అపాయింట్‌మెంట్‌ వాయిదా పడటంపై టీఆర్‌ఎస్‌ నాయకుల విమర్శలపై రాష్ట్ర బీజేపీ ఘాటుగానే స్పందించింది.

ఎన్ని కల ముందు టీఆర్‌ఎస్‌ వాగ్దానాలు, అధికారం లోకి వచ్చాక ఇచ్చిన హామీల అమల్లో ప్రభు త్వం వైఫల్యంపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనకు టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై రానున్న రోజుల్లో ఆందోళనలు తీవ్ర తరం చేసేందుకు సిద్ధమవుతోంది. యూపీలో బీజేపీ గెలిస్తే తెలంగాణలో పార్టీకి తప్పకుండా కలిసి వస్తుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement