పుణ్యస్నానాలకు వెళ్లి బాలుడి మృతి

17 Feb, 2015 14:59 IST|Sakshi

నేరడిగొండ(ఆదిలాబాద్): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్య స్నానాలకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దన్యానాయక్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన జాదవ్ మహేశ్(10) పుణ్యస్నానం కోసం స్నేహితులతో కుంటల జలపాతానికి వెళ్లాడు.  ఆ బాలుడు ప్రమాదవ శాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు