పైన్ రైస్ | Sakshi
Sakshi News home page

పైన్ రైస్

Published Thu, Dec 25 2014 12:59 AM

పైన్ రైస్

29 నాటికి అన్ని రేషన్ షాపులకు సరఫరా
యుద్ధప్రాతిపదికన పనులు.. సెలవులు రద్దు
ఎంఎల్‌ఎస్ పాయింట్లకు ప్రత్యేకాధికారుల నియామకం

 
రేషన్‌కార్డు దారులు, సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం

 
హన్మకొండ అర్బన్: పేద ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వనుంది. రేషన్‌కార్డు దారులతోపాటు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇక నుంచి సన్నబియ్యం సరఫరా చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆహార భద్రత కార్డులకు  సంబంధించి జిల్లాలో ప్రజల నుంచి అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తించారు. వారికి సరిపడా కోటాను రేషన్ షాపులకు సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ నెల 29వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలని జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు ఆదేశించారు. పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేం దుకు ప్రతి ఎంఎల్‌ఎస్ పాయిం ట్‌కు ఒక అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. మొత్తం 18 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా పంపిణీ ప్రక్రియ చేపట్టారు.

8 లక్షల కార్డులు

జిల్లాలో బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 8 లక్షలకు పైగా రేషన్‌కార్డులు నమోదయ్యాయి. వీటిలో మొత్తం 26 లక్షల మంది లబ్ధిదారులు(యూనిట్లు) ఉన్నట్లు అధికారు లు లెక్కించారు. పూర్తి స్థాయిలో లెక్కలు తేలితే ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఆహార భద్రత కార్డులో ఎంత మంది ఉం టే అందరికి  6 కిలోల చొప్పున సన్న బియ్యం జనవరి నెల కోటాగా అందజేయనున్నారు. ఈ మొత్తం సుమారు 18వేల మొట్రిక్ టన్నులుగా గుర్తించారు. అరుుతే గత నెలలో  పాత కార్డుల లెక్కల ప్రకారం జిల్లాలో 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని కార్డుదారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం కొత్త కార్డులు సంఖ్యా పరంగా కొంత తక్కువగా ఉన్నప్పటికీ... కోటా పెంచడంవల్ల మొత్తం సుమారు 6వేల మెట్రిక్ టన్నులు పెరిగింది. లెక్కలు పూర్తయితే కోటా మరింత పెరిగే అవకాశం ఉంది.

సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు జనవరి నుంచి పూర్తి కోటా సన్నబి య్యం సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిం చింది. ఈ దిశగా కూడా పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్షేమ శాఖల అధికారులు అందజేసిన లెక్కల ప్రకారం 2,30,000 మంది విద్యార్థులకు అవసరమైన 2.77 వేల మొట్రిక్ టన్నుల బి య్యం సరఫరా చేయనున్నారు. సర్వేలో గుర్తించిన అంత్యోదయ కార్డుదారులకూ పూర్తిస్థారుులో బి య్యం అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

29 వరకు సెలవులు రద్దు

పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లు, సిబ్బంది సెలవులను 29వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు డీఎస్‌ఓ ఉషారాణి తెలిపారు. స్థానిక అవసరాల మేరకు అదనంగా సిబ్బంది, వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువులోగా జిల్లాలోని 2,114 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులుగా ఆర్డీఓలు, డీఎం, డీఎస్‌ఓ ఇతర ఉన్నతాధికారులను నియమించారు.

కొనసాగుతున్న నమోదు

ప్రస్తుతం ఆహార భద్రత కార్డుల అర్హుల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10.69 ల క్షల దరఖాస్తులు రాగా...  క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తిచేసి వివరాలు నమోదు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం కొత్తకార్డుల జారీకి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement