- 65 తులాల బంగారం స్వాధీనం
సారంగాపూర్: ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ పోలీసులు ఓ చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం చించోలి (డీ) గ్రామం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా కనిపించిన ఆడెపు సాగర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో చోరీలు గుట్టు వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇతడు డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించుకు పోయినట్టు తెలిసింది. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసి అతడు ఇచ్చిన సమాచారంతో 65 తులాల బంగారు ఆభరణాలు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.