‘చాంబర్ల’పై స్పీకర్ల ఏకాభిప్రాయం | Sakshi
Sakshi News home page

‘చాంబర్ల’పై స్పీకర్ల ఏకాభిప్రాయం

Published Wed, Aug 6 2014 1:59 AM

Chambers allocation issue solved by Speakers meetings for two states

* ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు
* సమస్యలు తలెత్తితే మళ్లీ సమావేశం
* ఆగస్టు 18 నుంచి  13 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు
* ఆగస్టు రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ భేటీలు
* సమన్వయంతో ముందుకెళ్తాం: కోడెల, మధుసూదనాచారి

 
సమన్వయంతో ముందుకెళ్తాం: ప్రస్తుతం ఏర్పడిన సమస్యలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చాం. స్పీకర్లు, చైర్మన్లు, ఇలా ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు పూర్తిచేస్తాం. అంతిమంగా రెండు రాష్ట్రాల చట్టసభలు బాగా పనిచేసే వాతావరణం ఉండాలని భావించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చట్టసభల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. పవిత్రమైన సభల్లో ప్రజాసమస్యల పైనే చర్చలు జరగాలి. సమస్యలపై ఇప్పటికే మూడుసార్లు చర్చించాం. ఒకరిపై ఒకరం ఏనాడూ ఏమాటా అనుకోలేదు. రాష్ట్రాలుగా విడివడినా ఇరు ప్రాంతాల వారమంతా ఒక్కటే.
- మధుసూదనాచారి, తెలంగాణ స్పీకర్
 
 ఏకాభిప్రాయానికి వచ్చాం
 అసెంబ్లీ, మండలి ప్రాంగణాల్లో వసతుల ఏర్పాటు, సమావేశాల సమయంలో ఇబ్బం దులు లేకుండా తీసుకోవలసిన చర్యలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. పరస్పర సహకారంతో రెండు ప్రాంతాల బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించేలా చూస్తాం. సమస్యలున్నా వాటిపై ఎప్పటికప్పుడు చర్చిం చుకొని పరిష్కరిస్తాం. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండో వారంలో ఉండవచ్చు. బడ్జెట్ సమావేశాలైనందున కొన్ని రోజులు రెండు అసెంబ్లీలు, మండళ్ల సమావేశా లు ఒకేసారి జరగాల్సి రావచ్చని అపుడు సమస్యలు రాకుండా తీసుకోవలసిన చర్యలపైనా ఓ అవగాహనకు వచ్చాం.
 - కోడెల శివప్రసాద్, ఏపీ స్పీకర్
 
 సాక్షి,  హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చట్టసభలమధ్య నెలకొన్న చాంబర్ల కేటాయింపు వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లు సమావేశమై ఈ వివాదం పరిష్కారంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అసెంబ్లీ ఒకటో నంబర్ కమిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఏపీ మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఇరు రాష్ట్రాల శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రులు యనమల రామకృష్ణుడు, టి.హరీష్‌రావు, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు రాజసదారాం, కె.సత్యనారాయణ (ఇన్‌చార్జి)లు పాల్గొన్నారు.
 
 అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, డిప్యూటీ స్పీకర్లు, వైస్‌చైర్మన్లు, ప్రతిపక్షనేతలు, మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్ లు ఇలా ప్రాధాన్యతా క్రమంలో ముందు చాం బర్లను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఇతరనేతలకు, సభ్యులకు అసెంబ్లీలో వసతితో పాటు క్వార్టర్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఇరురాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరగకుండా వేర్వేరు తేదీల్లో నిర్వహించడం, ఒకే సారి జరిగే రోజుల్లో తలెత్తే సమస్యలపైనా అవగాహనకు వచ్చారు.
 
 అవసరమైతే మరోసారి భేటీ...

 అసెంబ్లీ, మండలి ఆవరణల్లో ఉన్న భవనాలు, వాటిలో అందుబాటులోఉన్న గదులు, ప్రస్తుతం చాంబర్లు కేటాయింపు కావలసిన వివిధ హోదాల్లోని నేతలు, తదితర అంశాలతో నివేదికలను అసెంబ్లీల కార్యదర్శులు సమావేశం ముందుం చారు. కార్యదర్శులు పోటాపోటీగా ఇచ్చిన సర్క్యులర్లనూ స్పీకర్లు సమీక్షించారు. ముందు గా ప్రాధాన్యత ప్రకారం కేటాయింపులు చేయాలని, చివర్లో ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే మరోసారి సమావేశమై పరిష్కరించుకోవాలని అభిప్రాయానికి వచ్చారు.
 
 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయించిన చాంబర్‌నే తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ చాంబర్ ఏపీ అసెంబ్లీ సమావేశమందిరాన్ని అనుకొని ఉన్నందున బుద్ధప్రసాద్‌కు కొనసాగించాలన్న అభిప్రాయానికి వచ్చా రు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి వేరే చాంబర్‌ను కేటాయించనున్నారు.
 
 తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఇంకా చాంబర్ కేటాయించనందున ముందుగా ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు చేసుకుంటూ రావాలన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఏపీ అసెంబ్లీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిలకు ఇటీవల కేటాయించిన గదులు, వాటిపై ఏర్పడిన వివాదం అంశంపైనా చర్చించారు. శాసనసభ సచివాలయంలో ఓమూలనున్న చిన్నగదిని వైఎస్సార్ కాంగ్రెస్‌కు కేటాయించడంపై విమర్శలు రావడంతో దాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ (ఇన్‌చార్జి) వినియోగిస్తున్న చాంబర్‌ను ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయించనున్నారు.
 
 తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆ రాష్ట్ర స్పీకర్ చాంబర్ పక్కనే ఉన్న (ప్రతిపక్షనేతగా చంద్రబాబు  వినియోగించిన) చాంబర్‌ను కేటాయించాలని భావిస్తున్నారు. ఇంకా ఇతరులకు చాంబర్ల కేటాయింపుపై ఒకటిరెండురోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
 బడ్జెట్ సమావేశాల్లో కొన్ని రోజుల పాటు ఒకేసారి రెండు అసెంబ్లీల భేటీల సమయంలో ఇరుప్రాంతాల ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేం దుకు వేర్వేరు ప్రాంతాల్లో మీడియా పాయింట్ల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
 వేర్వేరు తేదీల్లో బడ్జెట్ సమావేశాలు
 రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపైనా సమావేశంలో ప్రస్తావన వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 13వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థికమంత్రి యనమల  వివరించారు. రెండు సమావేశాలు ఒకేసారి జరగకుం డా ఉండేలా ఆ తరువాత తేదీల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుంద న్న అభిప్రాయం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ రెండోవారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే అవకాశంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు.

Advertisement
Advertisement