చార్జీలు తగ్గించాల్సిందే | Sakshi
Sakshi News home page

చార్జీలు తగ్గించాల్సిందే

Published Sun, Jun 26 2016 11:35 PM

Charges reduced

సామాన్యుడి ఆవేదన


జనగామ : ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు ఎడాపెడా చార్జీలు పెంచే స్తూ పెను భారం మోపుతున్నారని సామాన్యు డు ఆవేదన చెందుతున్నాడు. స్వరాష్ట్రం సాధిం చుకుంటే కష్టాలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశనే ఎదురవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంపై ప్రజలు ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. చార్జీల పెంపుపై వారి మాటల్లోనే..

 

బస్సు చార్జీలు తగ్గించాలి
ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి. తెలంగాణ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే ఈ వడ్డింపులు ఏంటి. పల్లెవెలుగు బస్సుల చార్జీలు కూడా పెంచడం దారుణం. - ఒరుగంటి తిరుపతి, చీటకోడూరు


ధనిక రాష్ట్రం అంటిరికదా
తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ధరలు పెంచుడు బాగోలేదు. నిత్యావసర  సరుకులు, కూరగాయల ధరలతో మధ్యతరగతి ప్రజలు అవస్థ పడుతున్నారు. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీల పెంపు పెనుభారం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజలను బాదుడు బాగోలేదు. - లగిశెట్టి వెంకటేశ్వర్లు, రైల్వేస్టేషన్‌రోడ్డు, జనగామ 

 

 

కరెంటు చార్జీలతో నష్టమే
కరెంటు చార్జీల పెంచుతో జిరాక్స్ దుకాణంపై భారం పడనుంది. వంద యూనిట్లు దాటితే రూపాయి వరకు వడ్డిస్తుండడంతో తాము కూడా ధరలు పెంచాల్సి వస్తోంది. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలి.  - వేమెళ్ల సురేష్‌రెడ్డి, జిరాక్స్ దుకాణం, జనగామ

 
హోటళ్లపై మోయలేని భారం

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హోటళ్లపై ఆధారపడి జీవిస్తున్న వారికి మోయలేని భారం పడనుంది. టిఫిన్స్‌కు అవసరమయ్యే ప్రతి వస్తువును గ్రైండర్‌లోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు పెరిగి నష్టపోతాం. - బాషెట్టి రాజశేఖర్, హోటల్ యజమాని, జనగామ

 

రూపారుు పెంచితే ఎలా?
విద్యుత్తు చార్జీల పెంపు నుంచి వాణిజ్య వినియోగదారులను సడలించాలి. సామాన్యుడి నుంచి ధనికుడి వరకు 100 యూనిట్లు వాడని వారు ఉండరు. ఒక్కసారిగా రూపాయి పెంచితే ఎలా.
- ఎండి.సమీర్, వ్యాపారి, జనగామ 

 

చార్జీలను వెంటనే తగ్గించాలి
ప్రభుత్వం విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి ఒక్కటి పెరగడమే తప్ప, ధరలకనుగుణంగా సామాన్యునికి ఒరిగింది ఏమీలేదు. ఏ చార్జీలు పెంచినా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. - రాపోలు ఉపేందర్, టైలర్, జనగామ 

 

 

Advertisement
Advertisement