ఇందిరమ్మ ఇళ్లపై నిఘా | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లపై నిఘా

Published Sun, Aug 17 2014 2:57 AM

ఇందిరమ్మ  ఇళ్లపై నిఘా

ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సీబీసీఐడీ అధికారులే దిగ్భ్రాం తికి గురయ్యేలా సాగిన ఈ బాగోతంలో అసలు దోషులు త్వరలోనే బయట పడనున్నారు. జిల్లాలో వారం రోజులుగా సీబీసీఐడీ అధికారులు జట్లుగా విడిపోయి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి విచారణలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇళ్ల కుంభకోణంపై ప్రభుత్వం థర్డ్ పార్టీతో చే యించిన విచారణలో వెలుగుచూసిన అక్రమాలకు తోడు కొత కోణాలు బయటపడటం చర్చనీయాంశం అవుతోంది. 16 మండలాలలోని 29 గ్రామాలలో సు మారుగా 2,705 ఇళ్ల పేరిట రూ.42.50 కోట్లు స్వాహా అయినట్లు థర్డ్ పార్టీ విచారణలో తేలగా, ఆరు మండలాలలో సీబీ సీఐడీ జరిపిన దర్యాప్తులో మరిన్ని అవకతవకలు వెలుగు చూశాయి. పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగిన లింగంపేట మండలం పొల్కంపేట, సదాశివనగర్ మండలం  భూంపల్లికి సంబంధించిన నివేదికను తయారు చేసిన అధికారులు దానిని హైదరాబాద్ కు పంపనున్నారు. శనివారం సాయంత్రం వారు నిజామాబాద్ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలోనూ పలువురిని విచారించారు.
 
అంకెల గారడీపై ఆరా
ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో అధికారులు చేసిన అంకెల గారడీపైనా సీబీసీఐడీ ఆరా తీస్తోంది. ఈ పథకం కింద జిల్లాకు మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి ? లబ్ధిదారుల సంఖ్య ఎంత? ఒక్కొక్క కుటుంబంలో ఎందరి పేరిట ఇళ్లు మంజూరయ్యాయి? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం జిల్లాలో 5,91,033 కుటుంబాలు, 5,90,445 ఇళ్లు ఉన్నాయి. ఇందులో 22,717 ఇళ్లు శిథిలావస్థలో ఉండగా, ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకంలో 2.80 లక్షల ఇళ్లు మం జూరు చేశారు.
 
ఇందులో 1,27,121 ఇళ్లు కట్టామని, ఇంకో 1.51,984 ఇళ్లకు నిధులు మంజూరైనా పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కుటుం బాల సంఖ్య, మంజూరైన ఇళ్ల సంఖ్యకు, అధికారుల వివరాలకు అసలు పొంతన కుదరడం లేదు. దీనిపైనే సీబీసీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో వా రు గృహ నిర్మాణ సంస్థ జిల్లా మాజీ మేనేజర్ జ్ఞానేశ్వర్‌రావుతోపాటు అయన హయాంలో పనిచేసిన ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలపైనా ఆరా తీస్తుండటం కలక లం రేపుతోంది.
 
రికార్డులు స్వాధీనం
ప్రగతినగర్ : ఐపీఎస్ అధికారి చారుసిన్హా నేతృత్వంలోని ఆరుగురు అధికారుల సీబీసీఐడీ బృందం ‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ జరుపుతోంది. ముందుగా ఎల్లారెడ్డి నియెజకవర్గంలోని లింగంపేట్ మండలం పోల్కంపేట్, సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామాలలో విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్‌పీ శ్రీనివాస్‌రావు, సీఐలు ఉదయ్‌కిరణ్, వెంకటేశ్వర్, ఎస్‌ఐ సాల్మన్‌రాజు ఇక్కడ పూర్తి సమాచారాన్ని సేకరించారు.
 
పోల్కంపేట్‌లో 177 మంది లబ్ధిదారులు, భూంపల్లిలో 531 మంది లబ్ధిదారుల గురించి ఆరా తీశారు. అనంతరం భోదన్‌లో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి పూర్తి సమాచారాన్ని సేకరించారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా హైదరాబాద్‌కు పంపించారు. శనివారం మధ్యాహ్నం సీఐడీ ఎస్‌ఐ సల్మాన్ రాజు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయం నుంచి పోల్కంపేట్, భూంపల్లికి సంబందించిన రికార్డులు స్వాధీనం చేసు కున్నారు. ఈ నెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వే అనంతరం తిరిగి అన్ని గ్రామాలలో విడతలవారీగా విచారణ కొనసాగించనున్నారు.

Advertisement
Advertisement