కేతికిలో సినీ ప్రముఖుల సందడి | Sakshi
Sakshi News home page

కేతికిలో సినీ ప్రముఖుల సందడి

Published Fri, May 8 2015 8:50 PM

కేతికిలో సినీ ప్రముఖుల సందడి - Sakshi

మెదక్: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సినిమా రంగంకు చెందిన ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కేతకి సంగమేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చిన నిర్మాత శివకుమార్ మల్కపురం, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా దర్శకుడు దశరత్‌లకు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

వచ్చే మాసంలో షూటింగ్ ప్రారంభం:
కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాత శివకుమార్, దర్శకుడు దశరత్‌లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే మాసంలో మంచు మనోజ్, రేజినా హీరో హీరోయిన్లుగా సురక్ష బ్యానర్‌పై సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లు వారు తెలిపారు. అందులోనే బాగంగా కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి సినిమా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement