ముగిసిన బాలోత్సవ్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన బాలోత్సవ్‌

Published Tue, Dec 20 2016 2:32 AM

ముగిసిన బాలోత్సవ్‌

భద్రాచలం: భద్రాచలంలో 6వ జాతీయ స్థాయి భద్రాద్రి బాలోత్సవ్‌ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ వేషధారణలో చిన్నారులు, కూచిపూడి, భరత నాట్యం, గిరిజన, జానపద, వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలు సోమవారం ముగిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కోల్‌కతా ఖరగ్‌పూర్‌ నుంచి వచ్చిన చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ముగింపు సభలో పాల్గొన్న మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమ తులు అందించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చేకూరి కాశయ్య, బాలోత్సవ్‌ చైర్మన్‌ తాళ్లూరి పంచాక్షరయ్య, వైస్‌ చైర్మన్‌ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, తానా ట్రస్టు చైర్మన్‌ తాళ్లూరి రాజాశ్రీకృష్ణ, డైరెక్టర్‌ జయశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement