రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్

Published Wed, Aug 5 2015 9:55 AM

cm kcr condolence to madhya pradesh train accident victims families

హైదరాబాద్ : మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదాలపై  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మాచక్‌ నదిలో రెండు రైళ్ల బోగీలు పడిపోయాయి.

మధ్యప్రదేశ్‌లోని హర్దాకు 25 కిలోమీటర్ల దూరంలో గత రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కుదవా రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైల్వేట్రాక్‌పైకి భారీగా వర్షం నీరు చేరింది. ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఆ ట్రైన్‌ నుంచి 10 బోగీలు మాచక్‌ నదిలో పడిపోయాయి.

మరోవైపు సమాచార లోపంతో అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. జబల్‌పూర్‌ నుంచి ముంబై వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 5 బోగీలు మాచక్‌ నదిలో పడిపోయాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 30మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈ దుర్ఘటనలో గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement