10న హుజూరాబాద్‌లో ‘రైతు బంధు’  | Sakshi
Sakshi News home page

10న హుజూరాబాద్‌లో ‘రైతు బంధు’ 

Published Mon, May 7 2018 3:09 AM

CM KCR Started Rythu Bandhu In Huzurabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్‌ పుస్త కాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ప్రారంభించనున్నారు. మరుసటి రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7.30 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ కేంద్రాల వద్ద టెంట్లు వేయాలని, మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలకు చేరిన పాసు పుస్తకాలు, చెక్కులను పరిశీలించి గ్రామాల వారీగా పంపించాలని సూచించారు. కార్యక్రమం జరిగే రోజుల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు, అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించాలని ఆదేశించారు.     

నేడు సివిల్స్‌ టాపర్‌కు సీఎం విందు 
సివిల్స్‌లో టాపర్‌గా తెలంగాణ బిడ్డ నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆలిండియా టాపర్‌ అనుదీప్, అతని తల్లిదండ్రులను సోమవారం మధ్యాహ్న భోజనానికి సీఎం ఆహ్వానించారు. 

Advertisement
Advertisement