ఉద్యాన వర్సిటీ దక్కేనా! | Sakshi
Sakshi News home page

ఉద్యాన వ ర్సిటీ దక్కేనా!

Published Mon, Jul 21 2014 12:29 AM

ఉద్యాన వర్సిటీ దక్కేనా!

- మన నేతల యత్నాలు ఫలిస్తాయా?
- వర్సిటీ ఏర్పాటుపై నీలినీడలు

కథలాపూర్ : తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన హార్టికల్చర్ యూనివర్సిటీ జిల్లాకు దక్కుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభం కావడంతో జిల్లాలో ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇక్కడ అనువైన స్థలం ఉందని అధికారులు నివేదించినా పరిగణలోకి తీసుకోకపోవడంతో విద్యాభిమానులు నిరాశ చెందుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తే తప్ప వర్సిటీ దక్కే అవకాశం లేదని నాయకులు పేర్కొంటున్నారు.
 
అందుబాటులో భూమి..
జగిత్యాల డివిజన్‌లోని కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ శివారులో సర్వేనెంబర్ 570లో 313 ఎకరాలు, సర్వేనెంబర్ 571లో 460 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, ఇది వర్సిటీకి అనుకూలంగా ఉంటుందని అధికారులు రాష్ట్ర అధికారులకు నివేదిక పంపించారు. దీంతో ఇక్కడే వర్సిటీ  ఏర్పాటవుతుందని అందరూ ఆశపడ్డారు. ఇంతలో సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రతిపాదన    తేవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీనికితోడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని మరికొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో స్థాని క నాయకులు ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఎంపీ వినోద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి సమస్యను వివరించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సైతం వర్సిటీని గంభీ ర్‌పూర్‌లోనే ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించి ఆ ప్రతులను మంత్రులకు, సీఎంకు పంపించా రు. జగిత్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉన్న తరుణంలో, గంభీర్‌పూర్‌లో హార్టికల్చర్ యూనివర్సిటీ నెలకొల్పితే ప్రయోజనం చేకూరుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఇందు కో సం కృషి చేయాలని, వర్సిటీని తరలిపోకుండా చూడాలని వారు కోరుతున్నారు.  
 
జిల్లాలోనే ఏర్పాటు చేయాలి : మాజీ ఎంపీ పొన్నం
కరీంనగర్ :  తెలంగాణాకు కేంద్రం కేటాయించిన ఉద్యాన యూనివర్సిటీని జిల్లాలోనే నెలకొల్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నా రు. ఆదివారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కథలాపూర్, అంతర్గాంలలో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి అనువైన స్థలం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఉద్యాన వర్సిటీ నెలకొల్పితే వ్యవసాయం రంగంతోపాటు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.

ఈ యూనివర్సిటీకి స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని కోరారు. ఆయన చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్‌లో కాకుండా ఉద్యాన వర్సిటీని గజ్వేల్‌లో నెలకొల్పాలనుకోవడం తగదన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా అమలు చేయాలని, మాట నిలుపుకోకుంటే ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు టీఆర్‌ఎస్‌లో చేర డం అప్రజాస్వామికమని, వారు పదవులకు రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు.
 
పార్టీ ఆదేశిస్తే రెడీ
కాంగ్రె స్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పదవి తీసుకోవడానికైనా తాను రెడీగా ఉన్నట్లు పొన్నం పేర్కొన్నారు.  పీసీసీ అధ్యక్ష పదవి తాను కోరుకోలేదని, కానీ అధిష్టానం ఆదేశిస్తే చేపట్టడానికి సిద్ధమేనని అన్నారు. ఆయన వెంట మాజీ మేయర్ డి.శంకర్, కన్నకృష్ణ, కర్ర రాజశేక ర్, మల్లికార్జున రాజేందర్, ఆమ ఆనంద్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement