తెలంగాణ భవిష్యత్తు కోసమే కాంగ్రె‌స్-సీపీఐ పొత్తు | Sakshi
Sakshi News home page

తెలంగాణ భవిష్యత్తు కోసమే కాంగ్రె‌స్-సీపీఐ పొత్తు

Published Mon, Apr 28 2014 1:43 AM

Congress - CPI alliance for the future of telangana

బెల్లంపల్లి, న్యూస్‌లైన్ :  తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి పట్టణంలోని కాంటా చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆంకాంక్ష నెరవేరదని, అదంతా కుటుంబ పాలన అని దుయ్యబట్టారు.

 ప్రత్యేక రాష్ట్రం కోసం అసెంబ్లీ, పార్లమెంట్‌లో పోరాడిన గుండా మల్లేశ్, గడ్డం వివేకానందను గెలిపించాల్సిన అవసరం ఉంద ని అన్నారు. ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వడంతోనే సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ తమ పార్టీతో జత కట్టిందన్నారు. పోటీ నుం చి వైదొలిగిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి చిలుముల శంకర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే కాంగ్రెస్-సీపీఐ ఉమ్మడి అభ్యర్థులను గెలి పించాలని కోరారు. సీపీఐ బెల్లంపల్లి అభ్యర్థి గుండా మల్లేశ్ మాట్లాడుతూ, శాసనసభలో తెలంగాణ అం శంపై మాట్లాడితే ఎంతగానో మెచ్చుకున్న కేసీఆర్ తన పై ఓ నేరస్తుడిని పోటీకి దింపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో తనకన్న ఎవరై నా ఎక్కువ అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాలు విసిరారు. కాంగ్రెస్-సీపీఐ నాయకులు సూరిబాబు, జగన్నాథం, రాజేశ్వర్, వి.సీతారామయ్య, కె.శంకర్, నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement