'వలసలకు పీసీసీ, సీఎల్పీ నేతలదే బాధ్యత'

1 Nov, 2014 15:08 IST|Sakshi
'వలసలకు పీసీసీ, సీఎల్పీ నేతలదే బాధ్యత'

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్లడానికి పీసీసీ, సీఎల్పీ నేతలే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్లోని నేతల వలసలను పసిగట్టడంలో పార్టీ సమన్వయ కమిటీ విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవశ్యకతను వీహెచ్ ఈ సందర్భంగా విశదీకరించారు.  బలోపేతం చేసే క్రమంలో తరచుగా సమావేశం కావాలని పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు వీహెచ్ సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు