‘డిసెంబర్‌లో ఎన్నికలు.. కేసీఆర్‌కు భయం’ | Sakshi
Sakshi News home page

‘డిసెంబర్‌లో ఎన్నికలు.. కేసీఆర్‌కు భయం’

Published Sat, Oct 6 2018 4:19 PM

Congress Party Well Comes CEC Elections Dates Says Madhu Yashki - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల తేదీలతో కేసీఆర్‌కు దిమ్మతిరిగిందని.. రెండు పెగ్గులు ఎక్కువేసుకుని నిద్రపోక తప్పదని నిజామాబాద్‌ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ ఎద్దేవా చేశారు. శనివారం ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈసీతో కేసీఆర్‌తో కుమ్మకై నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని తీవ్రంగా ప్రయత్నించారని, కానీ ఆనూహ్యంగా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగునున్నాయని ఆయన తెలిపారు. కేసీఆర్‌ జ్యోతిష్యుం బాగా నమ్ముతారని, నవంబర్‌లో ఎన్నికలు జరిగితేనే టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని జ్యోతిష్యుడు ఆయనకు చెప్పారని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌లో ఎన్నికలు రావడంతో కేసీఆర్‌కు భయం మొదలైందని అన్నారు.

ఎన్నికలు ముందుగా నిర్వహించి ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారని, ఆయన ఎత్తులు ఫలించలేదని పేర్కొన్నారు.  తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్‌ అనూహ్యంగా రద్దు చేసినప్పుడు కాంగ్రెస్‌ పార్టీతో పాటు, రాష్ట్ర ప్రజానీకమంతా కొంత ఆందోళన చెందిందని అన్నారు. కానీ అసెంబ్లీ రద్దు చేయడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. ముందుగానే కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి లంభించిందని మధుయాష్కీ పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవదని కేసీఆర్‌కు అర్ధమైందని, అందుకే మతిభ్రమించి నోటికి వచ్చినట్లు పచ్చి భూతులు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ నెల చివరిలో రాహుల్‌ గాంధీతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్‌లో సోనియా గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement