మండల పరిషత్‌లో పై‘చేయి’ | Sakshi
Sakshi News home page

మండల పరిషత్‌లో పై‘చేయి’

Published Sat, Jul 5 2014 2:22 AM

మండల పరిషత్‌లో పై‘చేయి’ - Sakshi

 సాక్షి ప్రతినిధి, వరంగల్ : మండల ప్రజా పరిషత్ పోరు ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా 42 మండలాల్లో ఎంపీపీ పదవులకు శుక్రవారం ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అత్యధికంగా 17 మండల ప్రజాపరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. జిల్లాలో 50 మండలాలు ఉండగా... రిజర్వేషన్ విషయంలో హైకోర్టు ఆదేశాలతో మంగపేట ఎంపీపీ ఎన్నిక వారుుదా పడింది. మిగిలిన 49 మండల ప్రజాపరిషత్‌లకు గాను.. శుక్రవారం 42 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్- 17, టీఆర్‌ఎస్-14, టీడీపీ-7, స్వతంత్ర అభ్యర్థులు-3, న్యూడెమోక్రసీ ఒక ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది.
 
స్వతంత్రులుగా గెలిచిన ఎంపీపీల్లో ఒకరు టీఆర్‌ఎస్, మరొకరు టీడీపీలో చేరే పరిస్థితి ఉంది. వరుస ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో నిర్వేదంలో ఉన్న కాంగ్రెస్‌కు ఎంపీపీ ఎన్నికలు ఊరటనిచ్చారుు. మెజారిటీ సీట్లు దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎన్నికలు వాయిదా పడిన 8 మండలాల్లో మెజారిటీ ఎవరికి వస్తుందనే దాన్ని బట్టి జిల్లా లో పార్టీల ఆధిక్యంపై స్పష్టత రానుంది. కాగా, ఎంపీపీ ఎన్నిక క్రమంలో లింగాలఘణపురంలో పోలీసులు, సర్పంచ్ మధ్య ఘర్షణ జరిగింది. గీసుగొండలో సైతం పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనంపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అక్కడ ఉన్న గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయూల్సి వచ్చింది.
 
ఏడు మండలాల్లో వారుుదా...
కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరిగితేనే మరుసటి రోజు ఎంపీపీ పదవికి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది. వివిధ కారణాలతో జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, వెంకటాపురం, జనగామ, మహబూబాబాద్, నల్లబెల్లి మండలాల్లో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగలేదు. ఈ ఆరు మండలాల్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
     
స్టేషన్‌ఘన్‌పూర్‌లో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో సంతకాలు లేవు. అధికారులు తిరస్కరించడంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
* హన్మకొండలో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఒకరు టీఆర్‌ఎస్, మరొకరు కాంగ్రెస్ తరఫున గెలిచారు. కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం దాఖలు చేసిన నామినేషన్‌కు ఒక ఎంపీటీసీ సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొకర సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. ఇక్కడ దాఖలైన ఒక నామినేషన్‌లో ఒకే ఎంపీటీసీ సభ్యుడి సంతకం ఉండగా... అధికారులు తిరస్కరించడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
* వెంకటాపురంలో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఎంపీపీ ఎన్నిక జరగలేదు.
* జనగామలో ఎంపీటీసీ సభ్యులు వచ్చినప్పటికీ వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఎన్నిక జరగలేదు.సమావేశానికి వచ్చిన సభ్యులు రెండు గం టల వరకు సంతకాలు చేయలేదు. స్వతంత్ర స భ్యుడిని తీసుకువెళ్లేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రయత్నించడంతో కార్యకర్తలు గుమిగూడారు. పోలీసుల లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.
* మహబూబాబాద్‌లో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలైనా... ఎంపీటీసీ సభ్యు లు సమావేశానికి రాకపోవడంతో ఎన్నిక వాయి దా పడింది.
* నల్లబెల్లిలో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నికకు దాఖలైన రెండు నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో ఎన్నిక జరగలేదు.
* కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరిగిన దుగ్గొండిలో ఎంపీటీసీల కోరం లేక ఎంపీపీ ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.

Advertisement
Advertisement