లైన్‌ బై లైన్‌గా కంటైన్మెంట్ల ఎత్తివేత | Sakshi
Sakshi News home page

44/151 లైన్‌ బై లైన్‌గా కంటైన్మెంట్ల ఎత్తివేత

Published Thu, Apr 30 2020 9:10 AM

Containment Zones Remove Lane By Lane in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గత కొంత కాలంగా గ్రేటర్‌ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏప్రిల్‌ 13 నుంచి 23 వరకు కేవలం పది రోజుల్లోనే 250 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా...ఆ తర్వాతి రోజు నుంచి ఇప్పటి వరకు 27 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. కేసులు తగ్గుతున్నాయని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేటర్‌లో 151 కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా, ఇటీవల కొత్తగా మరో ఏడు జోన్లు వచ్చి చేరాయి. దీంతో వీటి సంఖ్య 158కి చేరింది. గత 14 రోజుల నుంచి ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని 44 కంటైన్మెంట్‌ జోన్లను తొలగించారు. తాజాగా మరికొన్ని జోన్లను కూడా ఎత్తివేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే వాటిని కూడా ఎత్తివేయనున్నట్లు తెలిసింది. కొత్తగా వెలుగు చూసే పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడు తుండటంతో సగానికిపైగా క్వారంటైన్‌ సెంటర్లు ఖాళీ అయ్యాయి.

హోం క్వారంటైన్‌లో 1720 మంది
ఇప్పటికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన ప్రైమరీ కాంటాక్ట్‌లకు సన్నిహితంగా మెలిగి, అనుమానంతో ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లకు చేరుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఛాతి ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రి, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో సుమారు 30 మంది అనుమానితులు ఉండగా, మరో 1720 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక సనత్‌నగర్‌లోని నేచర్‌క్యూర్, పాతబస్తీలోని యునానీ, ఎర్రగడ్డలోని ఆయుర్వేద, రామంతాపూర్‌లోని హోమియో ఆస్పత్రి, తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(టిమ్స్‌) క్వారంటైన్‌ సెంటర్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.

అత్యధిక కేసులు ఇక్కడే...
జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిళ్లు ఉండగా, మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 28 వరకు 562 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే 138 మందికిపైగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే అత్యధికంగా యాకుత్‌పురలో 50, మెహిదీపట్నంలో 79, ఫలక్‌నుమాలో 55, మలక్‌పేటలో 39, కుత్బుల్లాపూర్‌లో 19, చందానగర్‌లో 15, చాంద్రాయణగుట్టలో 21, శేరిలింగంప³ల్లిలో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేవలం 30 కుటుంబాల్లోనే మూడు వందలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. వీరిలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో పాటు వారికి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. 

ఈ సర్కిళ్ల పరిధిలోనే అత్యధిక కేసులు...?
1. సర్కిల్‌ పేరు           యాకుత్‌పుర
కంటైన్మెంట్‌ జోన్లు    :    05
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    0
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు    :    50
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:    123

2. సర్కిల్‌ పేరు    :    చాంద్రాయణగుట్ట
కంటైన్మెంట్‌ జోన్లు    :    07
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    03
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు    :    21
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:    126

3. సర్కిల్‌ పేరు    :    మెహిదీపట్నం
కంటైన్మెంట్‌ జోన్లు    :    23
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    0
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు    :    79
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:    80

4. సర్కిల్‌ పేరు    :    చందానగర్‌
కంటైన్మెంట్‌ జోన్లు    :    09
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    08
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు    :    15
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు    : 40

5. సర్కిల్‌ పేరు        : కుత్బుల్లాపూర్‌
కంటైన్మెంట్‌ జోన్లు        : 07
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    03
కొత్తగా వచ్చి చేరినవి    :      0
మొత్తం పాజిటివ్‌ కేసులు    :     19
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు    : 340

6. సర్కిల్‌ పేరు    :     మలక్‌పేట్‌
కంటైన్మెంట్‌ జోన్లు    :    18
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    05
కొత్తగా వచ్చి చేరినవి    :    01
మొత్తం పాజిటివ్‌ కేసులు    :    39
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:    37

7. సర్కిల్‌ పేరు    :    చార్మినార్‌
కంటైన్మెంట్‌ జోన్లు    :    09
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    03
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు :            10
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:       45

8. సర్కిల్‌ పేరు        : ఫలక్‌నుమా
కంటైన్మెంట్‌ జోన్లు:        13
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    0
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు :    55
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:    185

9. సర్కిల్‌ పేరు    : ముషీరాబాద్‌
కంటైన్మెంట్‌ జోన్లు    :    07
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    02
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు :    12
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:    40

10. సర్కిల్‌ పేరు    :    గోషామహల్‌
కంటైన్మెంట్‌ జోన్లు    :    06
ఇప్పటి వరకు ఎత్తేసినవి    :    03
కొత్తగా వచ్చి చేరినవి    :    0
మొత్తం పాజిటివ్‌ కేసులు    :    10
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు:    12

Advertisement
Advertisement