పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య

Published Sat, Jul 5 2014 3:26 AM

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య

హన్మకొండ సిటీ : బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు, పదో తరగతి శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న ట్లు పేర్కొన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థుల(బాలికల) ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. తొలుత బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
 
 కష్టపడి చదవాలి
 విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్విని యోగం చేసుకుంటూ కష్టపడి చదువుకుని ఉన్నత స్థా యికి చేరాలని కలెక్టర్ కిషన్ సూచించారు. తెలంగాణ ఆవిర్భవించి రాష్ర్ట పునర్నిర్మాణం చేసుకుంటున్న దశ లో రాష్ర్టంలోనే జిల్లాలో మొదటిసారిగా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించడమే లక్ష్యంగా జిల్లాలో 29 శిబి రాలు ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో విద్యార్థులకు చదువు చెప్పేందుకు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడంతో పాటు మంచి భోజన, వసతి కల్పిస్తామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు బోధిస్తూ వారానికోసారి పరీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా బోధనలో మార్పులు చేస్తారని వివరించారు.
 
 దసరా, సంక్రాంతి సెలవులకు మాత్రమే ఇంటికి వెళ్లి, మిగతా పది నెలలు చదువుపైనే దృష్టి సారించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఐఐటీ కోచింగ్ ఇప్పించనున్నట్లు చెప్పారు. అలాగే, ఏమైనా సమస్య ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసేందుకు వీలుగా హాస్టల్‌లో కాయిన్ బాక్స్ ఏర్పాటుచేయిస్తానని తెలిపారు. హాస్టల్‌లో ఏర్పాటుచేయనున్న గ్రీవెన్స్ రిజి స్టర్‌ను వారానికో సారి పరిశీలించి విద్యార్థుల సమస్య లు పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భం గా విద్యార్థులకు పుస్తకాలు, బెడ్‌షీట్లు, దుప్పట్లు అం దించారు. సమావేశంలో ఏజేసీ కృష్ణారెడ్డి, డీఈఓ విజ య్‌కుమార్, సాంఘీక సంక్షేమ సహాయ అధికారిణి రమాదేవి, సమాచార కేంద్రం డిప్యూటీ డైరక్టర్ డీ.ఎస్.జగన్, హాస్టల్ వార్డెన్ పద్మజ పాల్గొన్నారు.

Advertisement
Advertisement