భూ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు | Sakshi
Sakshi News home page

భూ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు

Published Thu, Jun 15 2017 3:55 AM

భూ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు - Sakshi

కేసీఆర్, చంద్రబాబులపై సీపీఎం నేత రాఘవులు ధ్వజం 
 
సాక్షి, సూర్యాపేట: భూ మాఫియాకు తెలంగాణ, ఏపీ ముఖ్య మంత్రులు అండగా ఉంటూ కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన భూమాఫియాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా ఉండగా.. ఏపీలోని విశాఖపట్నంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మంత్రికి అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకే సుకు వస్తున్నారని విమర్శించారు. బుధ వారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాలేదని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం గా ఉన్నాయన్నారు.  విశాఖలో జరిగిన భూకుంభకోణం కేసును పోలీసులతో విచారణ చేయి స్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడం వెనుక మాఫియాకు కొమ్ముకాయడమేనని ఆరోపించారు. 
 
నోట్ల రద్దుతో జీడీపీ పడిపోయింది
దేశంలో జీడీపీ పడిపోయిందని ఇటీవల నిపుణులు తేల్చి చెప్పారని రాఘవులు పేర్కొ న్నారు. దీనికి కారణం ప్రధాని మోదీ తీసు కున్న నోట్ల రద్దు  నిర్ణయమేనని అన్నారు. నోట్ల రద్దుతో ఎంత మొత్తంలో నల్లధనం జమ చేశారు మొదలైన లెక్కలు ఇప్పటికీ బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమే మిటని ప్రశ్నించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement