బిల్లులకు చిల్లులు | Sakshi
Sakshi News home page

బిల్లులకు చిల్లులు

Published Fri, Jan 27 2017 1:50 AM

బిల్లులకు చిల్లులు

1104 యూనియన్‌ రూ.45 లక్షలకుపైగా బాకీ
327 యూనియన్‌ రూ.8.34 లక్షల బకాయిలు


సాక్షి, హైదరాబాద్‌: వారు బిల్లుల వసూళ్లలో కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. వినియోగ దారులతో దురుసుగా వ్యవహరిస్తుంటారు. ఇంటికి వచ్చి ఫ్యూజ్‌ తీసుకెళ్లడమో, కరెంట్‌ కనెక్షన్‌ తొలగించడమో చేస్తుంటారు. కానీ తమ యూనియన్‌ కార్యాలయాల బిల్లులు చెల్లించకున్నా కిమ్మనకుండా ఉండిపోతారు. ఇదీ కరెంటోళ్ల లీల. హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యుత్‌ ఉద్యోగ, కార్మిక యూనియన్ల కార్యాలయాలు దశాబ్దాలుగా విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లక్షలాది రూపాయల బకాయిలు పేరుకుపోయా యి. అయినా, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) యాజ మాన్యం యూనియన్ల కార్యాలయాలకు నిరాటంకంగా విద్యుత్‌ సరఫరాను కొనసా గిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఏటా వేలాది మంది విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికుల నుంచి యూని యన్లు లక్షల రూపా యల సభ్యత్వ రుసుం వసూ లు చేస్తున్నాయి. యూనియ న్లు పోటాపోటీగా పెద్ద ఎత్తున డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్య క్రమాలను నిర్వహిస్తున్నాయి. కానీ, ఏటా వచ్చే ఆదాయం నుంచి కొంత  బిల్లులకు వెచ్చించడానికి యూనియన్ల నేతలు చొరవ చూపడం లేదు. జిల్లాల్లో అయితే యూని యన్ల కార్యాలయాలకు విద్యుత్‌ మీటర్లు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

1104 వర్కర్స్‌ యూని యన్‌ కార్యాలయం రూ.45.32 లక్షలు. 327 కార్యాలయం రూ.8.34 లక్షలు. తెలుగునాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రూ.4.02 లక్షలు, ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లా యీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.4.47 లక్షలు, ఏపీఎస్‌ఈబీ టెక్నికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రూ.1.46 లక్షలు, స్టేట్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.69,140 బకాయిలను డిస్కంకు చెల్లించాల్సి ఉంది.

Advertisement
Advertisement