వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి | Sakshi
Sakshi News home page

వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి

Published Fri, Mar 16 2018 11:38 AM

Customers should know their rights - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోకుంటే మోసపోయే ఆస్కారముందని జాయింట్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సదస్సును జేసీ ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్‌ చెల్లింపులతో వస్తు సేవలు, కొనుగోళ్ల సందర్భంగా నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తు సేవలు, కొనుగోలు వ్యవహారాల పై అవగాహన పెంచుకోవాలని, ప్రతీ వస్తువుకు రశీ దు తీసుకోవాలని సూచించారు.

డీఎస్‌ ఓ శారదాప్రియదర్శిని మాట్లాడుతూ వినియోగదారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హక్కులు, బా ధ్యతలు తెలుసుకోవాలన్నారు. వినియోగదారుల వ్యవహారాల నిపుణు లు, ఎంవీఎస్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడు తూ వినియోగదారులు ప్రశ్నించే తత్వా న్ని అలవర్చుకోవాలని సూచించారు. సివిల్‌ సప్లయీస్‌ డీఎం బిక్షపతి, డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ దినేష్‌కుమార్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ధర్మేందర్, మున్సిపల్‌ కమీషనర్‌ సురేందర్, వినియోగదారుల క్లబ్‌ కన్వీ నర్‌ బాల్‌లింగయ్య పాల్గొనగా.. రెవె న్యూ సమావేశ మందిరం ఎదుట పలు శాఖల స్టాళ్లు ఏర్పాటుచేశారు. 

Advertisement
Advertisement