Sakshi News home page

సైకిల్ నీటి పంపు సృష్టికర్త మృతి

Published Wed, Feb 25 2015 10:40 PM

Cycle water pump founder Rathod vikaram passes away

ఆదిలాబాద్ (ఉట్నూర్): సైకిల్ సాయంతో నీటిని తోడే యంత్రాన్ని తయారు చేసి జాతీయ స్థాయిలో పేరొందిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని జైత్రాంతండాకు చెందిన రాథోడ్ విక్రమ్ (52) అనారోగ్యంతో బుధవారం మృతిచెందాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విక్రమ్ కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయూడు. పేదరికంలో పంటను రక్షించుకోవాలనే తపనతో నీటిని తోడే యంత్రాన్ని కనిపెట్టాలనుకున్నాడు.

దీంతో 2003లో సైకిల్ ద్వారా పంటలకు నీరందించేలా యంత్రాన్ని తయూరుచేశాడు. ఆ సందర్భంగా అతనికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అవార్డుకు ఎంపిక కావడంతోపాటు 2003లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయ బహుమతి అందుకున్నాడు. అంతేకాకుండా ఎన్‌ఐఎఫ్, హనీబీ ఏపీ స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా సైకిల్‌తో నడిచే నీటి పంపునకు 2004 నుంచి ఇరువై ఏళ్ల పాటు పేటెంట్ అధికారం పొందిన విషయం విధితమే.

Advertisement
Advertisement