కేసీఆర్ తీరుపై దళిత సంఘాల ఆందోళన | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తీరుపై దళిత సంఘాల ఆందోళన

Published Tue, Sep 23 2014 3:08 AM

Dalit communities concern on KCR

 ప్రగతినగర్ :  ధర్నాలు, ముట్టడి, ఆందోళనలు, నిరసనలతో సోమవారం కలెక్టరేట్ ప్రాం గణం అట్టుడికిపోయింది. ఉదయం నుం చే పోలీసులు కలెక్టరేట్ చుట్టూ ఉన్న గేట్ల ను మూసివేసి గట్టి భద్రత ఏర్పాటు చేశా రు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మాత్రం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని శాఖలలో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు  సూచించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయరాదన్నారు.

 దళితులకు మూడెకరాలు అందించాలి
 ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమిని అందించాలని వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దుబాస్ రా   ములు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తూ దళితులకు ద్రో హం చేస్తున్నారని ఆరోపించారు. బొజ్జా భూమాగౌడ్, సీపీఐ నాయకులు సుధాకర్, ఓమయ్య, బిసాయిలు, విఠల్‌గౌడ్, రమేశ్, గంగారాం పాల్గొన్నారు.

 సర్వీసును క్రమబద్ధీకరించాలి
 జీఓ 22 ప్రకారం అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల స  ర్వీసులను క్రమద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ అర్బన్ హెల్త్ సెంటర్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రమేష్, గోవర్ధన్ మాట్లాడుతూ 2014 జనవరి తరువాత ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ సాక్షరభారత్ కాంట్రాక్ట ఉద్యోగులు ధర్నా చేశారు.

 సమస్యలు పరిష్కరించండి
 జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో  కలెక్టర్‌కు వినతి పత్రా  న్ని ఇచ్చారు. ఏఐటీయూసీ నాయకులు సుధాకర్, ఓమయ్య మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వారికి ఈఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.
 
షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి  
 బోధన్‌లోని నిజాం షుగర్స్ దక్కన్ లిమిటెడ్‌ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యలో ధర్నా చేశా  రు. ఫార్వర్డ బ్లా క్ జిల్లా కన్వీనర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతి పెద్దదైన షుగర్ ఫ్యాక్టరీ ఎన్నో వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉఫాది కల్పించిందిన్నారు.
 
అక్కడ అలా చెప్పి
 తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు అవసరమైన ఐదు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాం    క్‌ను ఏర్పాటు చేస్తానని సింగపూర్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ దళితులకు మాత్రం మూడెకరాల భూమి పంపిణీ విషయాన్ని మరిచిపోయాని న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు. కలెక్టర్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య, నీలం సాయిబాబా, సీహెచ్ సాయాగౌడ్, ఎన్ నర్సయ్య, కృష్ణగౌడ్, పీడీఎస్‌యూ నాయకులురాలు సరిత, సౌందర్య, రవి, అరుణ్, రాజేశ్వర్, నరేష్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
ఓడ్ కులాన్ని గుర్తించాలి
 ఓడ్ కులస్తులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఓడ్ కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట ధర్నా చేశారు. తెలంగాణలో పదివేల కు టుంబాలకు పైగా జీవిస్తున్నారని సంఘం నాయకు  లు పేర్కొన్నారు. జిల్లాలో సుమారు మూడు వందలకుపైగా కుటుంబాలు మొరం, మట్టి, ఇసుక ప  నులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఓడ్ కులస్థులను ఎస్‌సీలలో చేర్చాలని డిమాండ్ చేశారు.
 
సుధాబార్‌పై చర్యలు తీసుకోండి
 నిబంధనలను తుంగలో తొక్కి నగరం నడిబొడ్డున ప్రజలు నివసించే ప్రాంతంలో నిర్వహిస్తున్న సుధాబార్‌ను మూసివేయించాలని వినాయక్‌నగర్‌వాసులు కలెక్టర్‌ను కోరారు. బార్‌కు సుమారు వంద అడుగుల దూరంలో పాఠశాల  ఉందని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు  ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
 
ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి..

 మిర్చి కాంపౌండ్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ స్థలంలో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు.

Advertisement
Advertisement