అదిరిందయ్యా...‘చంద్రం’ | Sakshi
Sakshi News home page

అదిరిందయ్యా...‘చంద్రం’

Published Fri, Aug 15 2014 12:08 AM

అదిరిందయ్యా...‘చంద్రం’ - Sakshi

కొత్త రాష్ట్రం.. కొత్త పథకాలు
పంద్రాగస్టు వేళ పండుగ కల
తీరిన నాలుగేళ్ల ‘కరువు’
దళితులకు భూ పంపిణీ, పెట్టుబడులు
రుణమాఫీతో రైతు మోములో ఆనందం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కొత్త రాష్ట్రం... కొత్త ముఖ్యమంత్రి...కొత్త పథకాలతో మెతుకుసీమ మురిసిపోతోంది. స్వరాష్ట్రంలో ‘తొలి స్వాతంత్య్ర’ వేడుకలకు జరుగుతున్న వేళ  దళిత, గిరిజన, రైతు శ్రామిక వర్గాలు మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సెల్యూట్ చేస్తున్నాయి. అండగా నిలబడి ఆపదలో ఆదుకున్న మంత్రి హరీష్‌రావుకు మనసులోనే నమస్కారం పెడుతున్నాయి. పంద్రాగస్టు కానుకగా కేసీఆర్ ప్రకటించిన వరాలు రైతాంగంలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సార్థకతకు అర్థం చెప్పాయి. రూ. లక్షలోపు రుణ మాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి, నాలుగేళ్ల పంట నష్టం పరిహారం విడుదలతో  అప్పుల బాధతో ఉన్న రైతాంగం మోములో చిరు నవ్వులు నింపాయి. ముఖ్యమంత్రి ఇలాగే సహకారం అందిస్తే వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపిస్తామంటున్నారు కర్షకులు.
 
రైతు మోములో చిరునవ్వు
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తూ గత నెలలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం, ఈ నెల 13న రుణమాఫీ విధి విధానాలు, మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో జిల్లా రైతాంగం సంబురాలు చేసుకుంటోంది. బంగారం తనఖాపెట్టి తెచ్చుకున్న రుణాలతో పాటు, స్వల్పకాలిక, రుణాలను కూడా మాఫీ చేస్తామన్న సర్కార్ ప్రకటనతో జిల్లాలో  3.65 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. సుమారు రూ.884 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని లీడ్ బ్యాం కు అధికారులు అంచనా వేస్తున్నారు.

లీడ్ బ్యాంక్ నివేదిక ప్రకారం  జిల్లాలో 4,58,637 మంది రైతులకు సం బంధించిన మొత్తం రూ.3,321.95 కోట్ల రుణాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,559.92 కోట్లు బంగారం కుద వబెట్టిన రుణాలు, మరికొన్ని టర్మ్ రుణాలున్నా యి. రూ.లక్ష, అంతకు లోపు రుణాలను తీసుకున్న రైతులు 2,76,678 మంది ఉన్నారు. ఈ రైతులు తీసుకున్న రుణాల విలువ  రూ.620 కోట్లు  వీటితో పాటు 29,347 మంది రైతులు రూ.184.58 కోట్లను బంగారంపై పంట రుణాలు తీసుకున్నారు. వీటితోపాటు మరో 5,670 మంది రైతులు 89.29 కోట్లు ఇతర వ్యవసాయ అనుబంధ రుణాలు తీసుకున్నారు. ఆయా రుణాలు మాఫీ కానుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.   
 
దళితుల్లో కొత్త ఆశలు...
తరతరాలుగా ఎదురుచూసిన గడియ వచ్చేసింది. బతుకు పోరాటం చేసినా సెంటు భూమి కూడా కొనలేక పోయిన దళితులు మూడు ఎకరాలకు ఆసాములయ్యే క్షణమొచ్చింది. దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్, దాని అమలుకు సిద్ధమ య్యారు. పంద్రాగస్టు  వేడుకల్లో ఎంపిక చేసిన దళితులకు పట్టాల రూపంలో 135 ఎకరాల భూమిని పంచబోతున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా గోల్కొండ వేడుకల్లో జిల్లాకు చెందిన ఆరుగురు దళి తులు పట్టా భూములు అందుకోనున్నారు.

ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఐదేళ్లపాటు కొనసాగించే ఈ మహాక్రతువులో జిల్లావ్యాప్తంగా దాదాపు 11,366 దళితకుటుంబాలు దశలవారీగా లబ్ధి పొందనున్నాయి. అధికారులు తొలివిడతగా తొమ్మిది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 45 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో  సీఎం చేతుల మీదుగా ఆరుగురు, మిగి లిన వారికి జిల్లాకేంద్రంలో నిర్వహించే వేడుకల్లో మంత్రి  హరీష్ చేతుల మీదు గా పట్టాలు అందుకోనున్నారు.
 ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూమి విలువ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.3.50 లక్షల నుంచి ఆపైన పలుకుతోంది. దళితులకు భూమితోపాటుగా పంటలు సాగు చేసేందుకు అవసరమైన పెట్టుబడులు కూడా ఇస్తామని మంత్రి ప్రకటించటం దళితుల్లో కొత్త ఆశలు రేపుతోంది.
 
నాలుగేళ్ల కరువు తీరింది
ఒక్క నిర్ణయంతో మెతుకుసీమ రైతాం గం నాలుగేళ్ల కరువు తీరింది. 2011 నుంచి 2014 వరకు వర్షాభావం,అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం విడుదల చేస్తూ  సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. పంటలు దెబ్బతిన్న జిల్లా రైతులు గత నాలుగేళ్లుగా పరిహారం సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు... ఇప్పుడంటూ గత ప్రభుత్వాలు చేసిన  వాగ్దా నాలతో రైతులు బేజారయ్యారు. ఇక పరిహారం చేతికందని రైతులు ఆశలు వదులుకున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా రైతాంగానికి శుభవార్త వినిపించారు.

నాలుగేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న పంటనష్టం పరిహారం సొమ్ము విడుదల చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ఉత్తర్వులు వెలువరించారు. జిల్లాలో 1.46 లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేకూరుస్తూ రూ. 46.36 కోట్ల పంటనష్టం పరిహారం విడుదల చేయటం రైతాంగానికి ఊరట నిచ్చింది. ఇకరావనుకున్న నష్టపరిహా రం నాలుగేళ్ల తర్వాత ఇంటిగుమ్మం తొక్కటంతో మెతుకుసీమ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.
 
పండుటాకులకు పండుగే....
దసరా నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 పింఛన్‌లు అందించేందుకు ముఖ్యమం త్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. జిల్లాలో జూన్ 14 నాటికి 1.67 లక్షల మంది వృద్ధు లు, 9,741 మంది వితంతువులు, 31,358 మంది వికలాంగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరూ దసరా నుంచి అందే పింఛన్‌తో ఆత్మగౌరవంతో బతకనున్నారు.

Advertisement
Advertisement