దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ | Sakshi
Sakshi News home page

దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ

Published Fri, Aug 8 2014 2:39 AM

దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ

 కనగల్ :దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవు లు తెలిపారు. కనగల్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలోని హైదలాపురంలో గురువారం ఆయన భూపంపిణీ పథకం లో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల తో సమావేశమయ్యారు.  మొదటి విడత భూ పంపిణీకి ఎంపికైన ఆదిమల్ల లక్ష్మ మ్మ, మాధవి, సరిత, శివకుమారి, పగడాల అంజలి వివరాలను అడిగి తె లుసుకున్నారు. భూపంపిణీకి వీరు అర్హులేనా అని గ్రామసభలో ప్రజలను అడిగారు. గ్రామంలో సాగుకుయోగ్యమైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఇతరుల నుంచి  17 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ వివరించారు.
 
 గ్రామ ంలో ఎకరం భూమి ఎంత ధర పలుకుతుందని కలెక్టర్ అడిగారు. సుమారు రూ 3లక్షల నుంచి రూ. 3.5 లక్షల దాకా పలుకుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకుయోగ్యమైన భూమిని లబ్ధిదారులకు చూపించి వారు నచ్చితేనే కొనుగోలు చేయాలన్నారు.  దళితులకు పంపిణీ చేసే భూములను అమ్మడానికి కొనడానికి వీల్లేదన్నారు. ఒక వేళ క్రయవిక్రయాలు జరిపినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిలేని ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒకవేళ అర ఎకరం, ఎకరం భూమి ఉన్నవారికి సైతం ఆ భూమి మినహా మిగతా భూమి ని ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలి పారు.
 
 నల్లగొండ నియోజకవర్గ పరిధిలో హైదలాపురం గ్రామాన్ని భూపంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. మొదటి విడత ఆగస్టు 15న  మహిళా లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేస్తామన్నారు. అనంతరం దళితులకు పంపిణీ చేసే భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ ఎండీ జహీర్, కనగల్ తహసీల్దార్ ఎం. వెంకన్న, ఆర్ ఐ ధర్మారెడ్డి, ఎంపీటీసీ కట్టెబోయిన నాగరాజు, వీఆర్‌ఓ రాంచందర్‌రావు, సర్వేయర్ శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో కూడా దళితులకు పంపిణీ చేయనున్న భూమిని కలెక్టర్ పరిశీలించారు.
 

Advertisement
Advertisement