Sakshi News home page

డిగ్రీ ఆన్‌లైన్‌ నోటిఫికేషన్‌ ఆలస్యం

Published Wed, May 3 2017 1:44 AM

డిగ్రీ ఆన్‌లైన్‌ నోటిఫికేషన్‌ ఆలస్యం

► ఈ నెల 15– 20 తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం
► వీసీల సమావేశంలో నిర్ణయం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియలో లోపాలను సరిదిద్దే కార్య క్రమం ఇంకా పూర్తి కానందున నోటిఫికేషన్‌ జారీ మరింత ఆలస్యం కానుంది. నోటిఫికే షన్‌ ను 5న జారీ చేయాలని తొలుత భావించారు. కానీ జాప్యం జరుగుతోంది. 6వ తేదీన డిప్యూ టీ సీఎం ఆధ్వర్యంలో జరిగే వీసీల సమావేశం లో నోటిఫికేషన్‌ జారీ తేదీపై నిర్ణయం తీసుకో నున్నారు. వీలైతే ఈ నెల 15–20 తేదీల మధ్య నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముంది. డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో వివిధ వర్సిటీల వీసీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర ్ణయాలు తీసుకున్నారు.

ఆ కాలేజీలకు మినహాయింపు
డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల నుంచి అటానమస్‌ కాలేజీలను మినహాయించాలన్న అంశం సమా వేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రవేశాలు, అకడమిక్‌ అంశాల్లో ఆయా కాలేజీలు యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా పొందినం దున.. ఆయా కాలేజీలను డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవే శాల (దోస్త్‌) నుంచి మినహాయించాలని నిర్ణ యించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 22 అటాన మస్‌ కాలేజీలుండగా.. అందులో 10 ప్రైవేటు, 9 ప్రభుత్వ, 3 వర్సిటీ అనుబంధ కాలేజీలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో అవన్నీ సొంతం గా ప్రవేశాలు చేపట్టుకునే వీలు ఏర్పడింది. ఇక గతేడాది 42 కాలేజీలు ఆన్‌లైన్‌ ప్రవేశాలపై కోర్టును ఆశ్రయించి సొంతంగా అడ్మిషన్లు చేసు కున్నాయి. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. అయితే ఈసారి ఆ కాలేజీలను కూడా ఆన్‌లైన్‌ ప్రవేశాల పరిధిలోకి తేవాలని నిర్ణయించారు.

ఇక ట్యూషన్‌ ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగాలని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వ ఆమోదం లేకుండా ఫీజులు పెంచవద్దని, ఫీజురీయింబర్స్‌మెంట్‌ లింకు ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలని కొంతమంది వీసీలు పేర్కొనగా... ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కమిటీ వేసి, అధ్య యనం చేయించి ప్రభుత్వానికి పెంపును సిఫా రసు చేయాలని మరికొందరు పేర్కొన్నారు.

సెమిస్టర్‌ పరీక్షల బహిష్కరణ
వీసీల సమావేశంలో ట్యూషన్‌ ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోనందుకు నిరసనగా ఈనెల 3 నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరిస్తున్నామని డిగ్రీ, పీజీ కాలేజీ యాజ మాన్యాల సంఘం నేతలు రమణారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. 3వ తేదీ నుంచి తెలంగాణ వర్సిటీ పరిధిలో, 5 నుంచి కాకతీయ వర్సిటీ పరిధిలో, 9 నుంచి మహాత్మా గాంధీ వర్సిటీ పరిధిలో, 11 నుంచి శాతవాహన వర్సిటీ, 19 నుంచి పాలమూరు, ఉస్మానియా యూని వర్సిటీల పరిధిలో మొదలయ్యే సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement