టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అరిఘోసే... | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అరిఘోసే...

Published Sat, Nov 24 2018 11:27 AM

 Difficulties to vote for the TRS - Sakshi

సాక్షి, కోడేరు: మండల కేంద్రంలో శుక్రవారం బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు షిర్డిసాయిబాబ ఆలయంలో ఆయన గెలుపు కోసం 108 కొబ్బరికాయలు కొట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రంగినేని జగదీశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆదికొమ్ము దానయ్య మహారాజ్, చామంతిరాజు మాట్లాడారు. రామకృష్ణ, శ్రీశైలం, జానకిరాములు, రాజవర్ధన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రాము, సంతోష్, పర్వత్‌రెడ్డి, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 


కొల్లాపూర్‌ రూరల్‌: తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోనిఅంకిరావుపల్లిలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రత్నప్రభాకర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జంబులయ్య, లాలయ్య, రాజు  ఉన్నారు. 


పెద్దకొత్తపల్లి: మండలలోని గంట్రావుపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు గణేష్‌రావు శుక్రవారం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు హన్మంతురెడ్డి, కాశన్న, రమేష్‌రెడ్డి, సీతారాంనాయక్, లింగారెడ్డి, కాంగ్రెస్‌ యువనేత పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


పెంట్లవెల్లి: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అధిక మొత్తంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కండువాలు కప్పుకుని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ కోసం తాము పనిచేస్తామని, హర్షవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో ఆయన గెలుపు కోసం కృషిచేస్తామని పలువురు కార్యకర్తలు అన్నారు.

హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని తెలిసి ఎంతోమంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని, రాబోయే కాలంలో కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. మండలాధ్యక్షుడు మతీన్, సురేందర్, రఫియోద్దీన్, ఎంపీటీసీ సభ్యుడు నాగరాజు, నర్సింహ, ఎల్లయ్య, కురుమూర్తి పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement