ఆ ఖతర్నాక్.. డిప్యుటేషన్ రద్దు | Sakshi
Sakshi News home page

ఆ ఖతర్నాక్.. డిప్యుటేషన్ రద్దు

Published Fri, Aug 29 2014 2:57 AM

Dipyutesan canceled

నీలగిరి : జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. రూ. 8 కోట్ల విలువ గల కందిపప్పు, శనగల కాంట్రాక్టు వివాదాస్పదం కావడం, పీడీ సెలవుపై వెళ్లిన నేపథ్యంలో ‘‘పిల్లల నోళ్లు కొడుతున్న పెద్దలు’’ శీర్షికన మెయిన్‌లో, ‘‘క్లర్కు కాదు...ఖతర్నాక్’’ శీర్షికన సాక్షి టాబ్లాయిడ్‌లో వరుస కథనాలు  ప్రచురితమయ్యాయి. డిప్యుటేషన్‌పై నల్లగొండకు వచ్చిన ఓ ఉద్యోగే కాంట్రాక్టు వ్యవహారాలు చక్కబెడుతున్న వైనాన్ని ‘సాక్షి’ ప్రధానంగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో  కలెక్టర్ టి.చిరంజీవులు ఆ ఉద్యోగి డిప్యుటేషన్ రద్దు చేసి యథాస్థానానికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఇన్‌చార్జ్ డెరైక్టర్ మోతీ ధ్రువీకరించారు.
 

Advertisement
Advertisement