మూడేళ్లు ఒకే చోట ఉంటే బదిలీ | Sakshi
Sakshi News home page

మూడేళ్లు ఒకే చోట ఉంటే బదిలీ

Published Fri, Jun 1 2018 1:37 AM

Discom frames guidelines for staff transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపి ణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెర లేచింది. 2018 మే 31 నాటికి ప్రస్తుత స్థానంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసు కున్న వారితో పాటు 2015–16లో జరిగిన సాధారణ బదిలీల్లో స్థానచలనం పొందిన ఉద్యోగులు ఈ ఏడా ది సాధారణ బదిలీలకు అర్హులు.

ఈ మేరకు ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, పీ అండ్‌ జీ సర్వీసు విభాగాల ఉద్యోగుల సాధారణ బదిలీలకు మార్గదర్శకాలను ప్రక టిస్తూ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాలను సంబంధిత డివిజన్‌/సర్కిల్‌ కార్యాలయాలు జూన్‌ 4 నాటికి సిద్ధం చేస్తాయి.

జాబితాపై అభ్యంతరాలతో పాటు బదిలీల విజ్ఞప్తులను జూన్‌ 11లోగా పంపాలి. జూన్‌ 18న బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తర్వాత ఎలాంటి బదిలీ ఉత్తర్వులూ జారీ చేయరాదు. క్రమశిక్షణ/విజిలెన్స్‌ ప్రాతిపదికన జరిపే బదిలీలు మినహాయింపు. స్థాన చలనం పొందిన వారిని జూన్‌ 25లోగా రిలీవ్‌ చేయాలి.

ఇంజనీరింగ్, అకౌంట్స్‌ ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలు  
సబ్‌ ఇంజనీర్‌/ఏఈ/ఏఈఈలను సర్కిల్‌ పరిధి లోని అదే డివిజన్‌ లేదా ఇతర డివిజన్‌కు సంబంధిత సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు బదిలీ చేయాలి
 ఏఈ/ఏఈఈ (సివిల్‌)లను సర్కిల్‌/జోన్‌ పరిధిలోని ఇతర స్థానానికి కార్పొరేట్‌ కార్యాలయం (సీఓ) బదిలీ చేస్తుంది. సాధ్యం కాకుంటే ప్రస్తుత స్థానంలో కొనసాగిస్తారు
 అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లను అదే సర్కిల్‌ లేదా ఇతర సర్కిల్‌కు సీఓ బదిలీ చేస్తుంది
 ఏడీఈ, ఆపై కేడర్‌; ఏఏఓ, ఆపై కేడర్‌ ఉద్యోగులను అదే సర్కిల్‌లో లేదా బయటకు సీఓ బదిలీ చేస్తుంది
♦  జీహెచ్‌ఎంసీ పరిధిలో పని చేస్తున్న ఏఈ/ఏడీఈ, సమాన కేడర్‌ ఉద్యోగులను జీహెచ్‌ఎంసీ యూనిట్‌గా సీఓ బదిలీ చేయనుంది
 బదిలీలన్నీ ప్రాధాన్య స్థానం నుంచి ప్రాధాన్యత లేని స్థానానికి, ప్రాధాన్యత లేని స్థానం నుంచి ప్రాధాన్య స్థానానికి జరుగుతాయి. ఆపరేషన్, కమర్షియల్, హెచ్‌టీ మీటర్స్‌ విభాగాల పోస్టులను ప్రాధాన్య పోస్టులుగా; హైదరాబాద్‌ దక్షిణ సర్కిల్, మెహిదీపట్నం, వికారాబాద్‌ సర్కిల్, ట్రూప్‌ బజార్, బేగంబజార్, ఏసీ గార్డ్స్‌ సబ్‌ డివిజన్లను అప్రాధాన్యత ప్రాంతాలుగా చూస్తారు
 రిక్వెస్ట్‌/పరస్పర బదిలీ దరఖాస్తులను జూన్‌ 11లోగా పంపాలి
మహిళా ఉద్యోగులను ప్రస్తుత ప్రాంతంలోని వేరే పోస్టుకు బదిలీ చేస్తారు. సాధ్యం కాకుంటే సమీపంలోని ఇతర ప్రాంతానికి పంపుతారు
♦  2019 జూన్‌ 30లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయరు.

Advertisement
Advertisement