నేటి సభలో విద్యుత్ పంపిణీపై చర్చ | Sakshi
Sakshi News home page

నేటి సభలో విద్యుత్ పంపిణీపై చర్చ

Published Fri, Nov 7 2014 7:35 AM

discussion over power generation sharing between Telangana and Andhra Pradesh

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ‘విద్యుత్’ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం నాడు ప్రధానంగా విద్యుత్ సమస్యపై చర్చ జరుగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చే పది ప్రశ్నల్లో.. మూడు ప్రశ్నలు విద్యుత్‌కు సంబంధించినవే ఉన్నాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య ఈ అంశంపై వివాదం రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రశ్నోత్తరాల్లో సీఎం కేసీఆర్ సమాధానాలు ఇవ్వనున్నారు. విద్యుత్ ఉత్తత్తి, పంపిణీ, నూతన పారిశ్రామిక విధానం, కల్యాణ లక్ష్మీ, భూ పంపిణీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లపై  తదితర అంశాలు ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బడ్జెట్ పై చర్చను ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రారంభిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement