ఉద్యోగాల పేరిట డీఎల్పీవో రూ.కోటికిపైగా వసూలు | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట డీఎల్పీవో రూ.కోటికిపైగా వసూలు

Published Wed, Sep 2 2015 2:54 AM

DLPO in the name of jobs one Rs. More than crore charged

పెద్దపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని వసూళ్లకు పాల్పడిన కేసులో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి(డీఎల్పీవో) వెంకయ్యను ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన వెంకయ్య ఆదిలాబాద్ జిల్లా కౌటాల ఎంపీడీవోగా పనిచేసే సమయంలో గ్రామపంచాయతీల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 25 మంది యువకుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు మొత్తం రూ.కోటికి పైగా వసూలు చేసి, వారికి నకిలీ నియామక పత్రాలు అందించాడు.

సతీశ్ అనే యువకుడికి ఇచ్చిన నియామకపత్రం నకిలీదిగా తేల డంతో అతడిచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి సీఐ కరీముల్లాఖాన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వెంకయ్య పెద్దపల్లిలో డీఎల్పీవోగా పనిచేస్తుండగా పోలీసులు మంగళవారం   వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో గోదావరిఖనికి చెందిన ఇద్దరు మధ్యవర్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం తిరిగి పెద్దపల్లికి వచ్చిన సీఐ డీఎల్పీవో కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement