రెండేళ్లవుతున్నా పనుల పూర్తి లే దు.. | Sakshi
Sakshi News home page

రెండేళ్లవుతున్నా పనుల పూర్తి లే దు..

Published Sun, Aug 24 2014 12:09 AM

రెండేళ్లవుతున్నా పనుల పూర్తి లే దు..

ఆదిలాబాద్ అర్బన్ :  జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ పనులు మంజూరై రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మంజూరు పనులు, పూర్తైవి, వివిధ దశల్లో ఉన్నవి, ప్రారంభం కాని వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు జిల్లాకు 34 మంజూరుకాగా, ఇప్పటి వరకు 21 పనులు పూర్తి చేశారని, ఇంకా 13 పనులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇందుకు గల కారణాలు అధికారులను అడిగారు.
 
కుంటాల, సిర్పూర్, రెబ్బెన, కెరమెరి, వాంకిడి, నేరడిగొండ, బాబేర (బోథ్)లో ఈ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 75 రోడ్డు పనులకుగాను 40 పనులు పూర్తి చేశారని, మిగతా 25 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇంకా ఆరు టెండర్ల స్థాయిలో ఉన్నాయని, అటవీ శాఖ అనుమతులు లేకపోవడం వల్ల కొన్ని పనులు నిలిచిపోయాయన్నారు. ఎక్కడెక్కడ ఆ పనులు నిలిచిపోయాయో వివరాలు తనకు పంపాలని మంత్రి సూచించారు. 13వ ఫైనాన్స్ కింద జిల్లాలో 18 పనులు ఉన్నాయని అన్నారు. అధికారులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు చెప్పాలని మంత్రి పేర్కొన్నారు.
 
ఈజీఎస్, గ్రామాల లింకురోడ్లు, మెటల్‌రోడ్లు తదితర పనులనూ వాకాబు చేశారు. ఐకేపీ, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు ఎన్ని పూర్తయ్యాయో తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లాలో 23 జేఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒక డిప్యూటీ ఈఈ పోస్టు ఖాళీగా ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ అమీనోద్దీన్, డిప్యూటీ ఈఈలు ప్రకాష్, శైలేందర్, సురేష్, రవి ప్రకాష్, అధికారులు పాల్గొన్నారు.
 
విద్య, ఆర్‌డబ్ల్యూస్‌పై సమావేశం
విద్య, ఆర్వీఎం, సాంఘిక సంక్షేమ శాఖల్లో పనుల తీరుపై ఆ శాఖల అధికారులతో మంత్రి జోగు రామన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ఉపాధ్యాయులు విద్యావ్యవస్థను పటిష్ట పర్చడం లేదన్నారు. పూర్తయిన పనులకు డబ్బులు చెల్లించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. అదనపు గదుల నిర్మాణం ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ నిర్మాణాలు చేపట్టాలని, ఆర్వీఎం, ఆర్‌ఎంఎస్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డు తెగల వారికి అందిస్తున్న సంక్షేమం పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి 2013-14లో 3,631 మంది కి రూ.22.60 కోట్లు లక్ష్యం కాగా, రూ.20,71 కోట్లతో 2,831 మందికి బ్యాంకు రుణాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు అధికారులు తెలిపారు.
 
1991 నుంచి 2010 వరకు 3,911 మంది ఎస్సీ, ఎస్టీలకు 6,438.12 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చామని పేర్కొన్నారు. దళిత మహిళలకు ఆగష్టు 15న రూ. 18.37 కోట్లతో 106 మంది లబ్ధిదారులకు వ్యవసాయ భూములు పంపిణీ చేశామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన నిధుల ప్రతిపాదనలు పంపితే సీఎంతో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ.. మంత్రి సూచనలు పాటించి సంక్షేమ పథకాల అమలు బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణ, ఆర్వీఎం పీవో యాదయ్య, డీడీఎస్‌డబ్ల్యూ శంకర్, అధికారులు పాల్గొన్నారు.
 
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచిం చారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో తాగునీటికి, వ్యవసాయానికి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. జిల్లాలో 14 ఏఈఈ, రెండు మం డలాలకు ఒక ఈఈ చొప్పున పదిహేను మండలాలు ఉన్నాయని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అశోక్ మంత్రికి వివరించారు.
 
హౌసింగ్ కాలనీలో విద్యుత్ సరఫరాకు కొన్ని కాల నీల్లో పనులు పూర్తయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పనులకు కలిపి మొత్తం 112 పనులకు గాను 100 పనులు పూర్తి చేశామని ఎస్‌ఈ తెలిపారు. సీఎల్‌డీపీ, ఇందిరా జలప్రభ పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్ల కొరకు ప్రభుత్వ భూములు కేటాయించాలని ఎస్‌ఈ కోరారు. విద్యుత్ కోతలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వివరాలు సక్రమంగా ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు.
 
సోలార్ సిస్టంతో నీటి పథకాలు..
గ్రామీణ మంచినీటి సరఫరా విభాగంపై మంత్రి జోగు రామన్న సమీక్షించారు. సోలార్ సిస్టమ్ ద్వారా నీటి పథకాలు పనిచేసేలా ప్రతిపాదించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ పత్రికల్లో వస్తున్నా ప్రతికూల వార్తలపై స్పందించాలని, మంచినీటి ట్యాంకులను అధికారులు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ అశోక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్రసేన్, ఎస్‌ఈలు, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement