సారాపై ఉన్న శ్రద్ధ చదువుపై లేదు | Sakshi
Sakshi News home page

సారాపై ఉన్న శ్రద్ధ చదువుపై లేదు

Published Sat, Aug 22 2015 5:00 AM

Dont have Attention on education have Attention alchohol

ప్రగతినగర్ : తెలంగాణ సర్కార్‌కు చీప్ లిక్కర్, సారాపై ఉన్న శ్రద్ధ విద్యార్థులు, వారి సమస్యలపై లేదని  బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులతో చెలగాటమాడుతోందన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్, రీరుుంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల యూజ మాన్యాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. తాము కట్టే పన్నులతో ప్రభుత్వం నడుస్తున్నా.. విద్యార్థుల చదువులకు మాత్రం ఫీజులు చెల్లించకపోవడం శోచనీయమన్నారు.   జేబులు నింపుకునేందుకు ఏర్పాటు చేసిన పథకాలను పక్కనబెట్టి గతం నుంచి కొనసాగుతున్న పథకాలను అమలు చేయూలని హితవు పలికారు.

 జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరం బకాయిలు 75 వేల మందికి 110 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యార్థుల సమస్యలు తీర్చడం చేతకాని పక్షంలో తప్పుకోవాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. రోజుకో పథకం ప్రవేశపెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేయడం కాదు... వారి పిల్లలకు ఆసరాగా నిలవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ యోగిత రాణాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి.ప్రవీణ్‌గౌడ్, జిల్లా కార్యదర్శి గంగాధర్, నగర అధ్యక్షుడు లక్ష్మన్ యాదవ్, నాయకులు కిరణ్‌కుమార్, దత్తు, ప్రశాంత్, గజానంద్, నాందేవ్, రాజు, కైలాష్, ఇస్మాయిల్, సుధీర్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement