పేదల కల నెరవేరుతుంది | Sakshi
Sakshi News home page

పేదల కల నెరవేరుతుంది

Published Fri, Oct 23 2015 11:43 PM

పేదల కల నెరవేరుతుంది - Sakshi

- ఆ సమయం ఆసన్నమైంది
- ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం
- డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
- హవేళిఘణాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన

మెదక్: నిరుపేదల కల నెరవేరే సమయం ఆసన్నమైందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ మండలం హవేళి ఘణాపూర్ గంగిరెద్దుల కాలనీలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు ఆమె భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలన్నారు. నిరుపేదల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ 125 గజాల్లో డబుల్ బెడ్‌రూమ్‌ను సకల సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్నారన్నారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ.5,04,000 చొప్పున మంజూరు చేశారన్నారు. మెదక్ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరైనట్టు చెప్పారు.

వీటికి సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ హవేళి ఘణాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గంగిరెద్దుల వారి కాలనీ హైదరాబాద్‌లా కనిపించాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో జరిగేలా లబ్ధిదారులు దగ్గరుండి చూసుకోవాలన్నారు. అంతకుముందు మండలంలోని పేరూర్‌లో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు ఇంకుడు గుంతలను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. పేరూర్ గ్రామం మరో ఎర్రవల్లి కావాలని ఆమె ఆ కాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డ్వామా పీడీ ఇంద్రకరణ్, ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, హవేళిఘణాపూర్ సర్పంచ్ సునీ తాసాయిలు, ఎంపీటీసీ శ్రీకాంత్, పేరూ ర్ సర్పంచ్ ర్యావ సుగుణ, నాయకులు కిష్టయ్య, అంజాగౌడ్, జయరాంరెడ్డి, సాయిలు, యాదగిరి, శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement