అకాల వర్షం.. 15 వేల హెక్టార్ల పంట నష్టం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. 15 వేల హెక్టార్ల పంట నష్టం

Published Mon, Apr 13 2015 1:39 PM

due to heavy rains 15 thosands hectors crops collapsed in telugu states

హైదరాబాద్: అకాల వర్షం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియజేశారు. ఇప్పటివరకు వర్షం కారణంగా తెలంగాణలోని వరంగల్లో ఇద్దరు, మహబూబ్నగర్లో ఒకరు చనిపోయినట్లు తెలిపారు. వర్షాల వల్ల రాష్ట్రంలో సుమారు 15 వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, కరీంనగర్లో 55 ఇళ్లు ధ్వంసమైనట్లు చెప్పారు. అత్యధికంగా పదివేల హెక్టార్లకు పైగా పంటనష్టం వాటిల్లగా ఇందులో నల్లగొండలో మూడు హెక్టార్లలో, కరీంనగర్లో ఆరు, మహాబూబ్నగర్ మూడు పశువులు మృతి చెందినట్లు తెలిపారు.జిల్లాలో పంట, ఆస్తి నష్టం వివరాలను త్వరగా పంపాలని తెలంగాణ విపత్తు నివారణశాఖ ఆదేశించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంటనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement