Sakshi News home page

కేంద్రం వల్లే తెలంగాణకు గ్రాంట్లు

Published Tue, Apr 7 2015 2:56 AM

కేంద్రం వల్లే తెలంగాణకు గ్రాంట్లు - Sakshi

  • సిమి ఉగ్రవాదులని ప్రకటించడానికే భయపడుతున్న ప్రభుత్వం
  • 11న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో
  • ఆవిర్భావ దినోత్సవం: కిషన్‌రెడ్డి
  • సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు పన్నుల్లోవాటాగాను, గ్రాంట్లు రూపంలోనూ ఆదాయం పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయం వల్ల గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రానికి రూ.2,254 కోట్లు పెరిగిందన్నారు. 14వ ఆర్థికసంఘం నిధుల్లో ఐదేళ్ల కాలానికి పన్నుల్లో వాటా 85,128 కోట్లు పెరుగుతాయని చెప్పారు. గ్రాంట్లుగా రూ.3,028 కోట్లు అధికంగా వస్తున్నాయని వివరించారు. బెంగుళూరులో జరి గిన పార్టీ జాతీయ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జెట్లీ ఈ వివరాలను తమకు అందించినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు.
     
    అది పూర్తి బాధ్యతా రాహిత్యమే..

    నల్లగొండ జిల్లాలో జరిగిన సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సిమీ ఉగ్రవాదులే దాడులకు తెగబడ్డారని పోలీసులు, జాతీయ స్థాయి నేర పరిశోధనా సంస్థలు చెబుతుంటే హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అది దోపిడీ దొంగల ముఠా అని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. సిమీ ఉగ్రవాదులేనని చెప్పడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కిషన్‌రెడ్డి నిలదీశారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలను సమకూర్చాలని  డిమాండ్ చేశారు. ఇంటిలిజెన్స్, కౌంటర్ ఇం టిలిజెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయాల న్నారు. సాధారణపోలీసులకూ ఆక్టోపస్ తర హా శిక్షణ ఇవ్వాలన్నారు. సూర్యాపేట ఘట నలో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి కూడా పోలీసులకు అందించిన నష్టపరి హా రం అందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశా రు.
     
    ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎదుర్కొంటాం

    కేంద్ర ప్రభుత్వ పథకాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై, భూసేకరణ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో  ఎదుర్కొంటామని చెప్పారు. రైతులకు ఉపయోగకరమైన అంశాలను చేరుస్తూనే, భావితరాల అభివృద్ధికోసం ముందుచూపుతో రూపొం దించిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించడమే పనిగా కాంగ్రెస్ పెట్టుకుందని విమర్శించారు. సెజ్‌ల కోసమని రైతులను బెది రించి భూములను ప్రభుత్వం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.  కేంద్ర పార్టీ సూచనలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ నెల 11న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృతసమావేశం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. 2019 నాటికి అధికారమే లక్ష్యంగా పార్టీని సంస్థాగత పటిష్ట పరుస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రస్థాయి నాయకులంతా సబ్సిడీ గ్యాస్‌ను వదులుకుంటున్నగా కిషన్ రెడ్డి వెల్లడించారు.
     
    బీజేపీతోనే దేశానికి రక్ష


    బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో సురక్షితమైన, దీర్ఘకాలిక అభివృద్ధి జరుగుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ సీనియర్ నేత, మాజీ గవర్నరు వి.రామారావు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, బీజేఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, నేతలు దినేశ్ రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement